లిక్కర్ సేల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్.. కండిషన్స్ అప్లై..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం అత్యవసర సేవలకు మినహా.. మిగతా వాటన్నింటిని మూసేశారు. అందులో కిరాణా దుకాణాలకు కూడా మినహాయింపు ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా పెంచే లిక్కర్‌ విక్రయాలపై కూడా నిషేధం విధించారు. దీంతో అనేక రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుండంతో.. పలు రాష్ట్రాలు మద్యం విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడిన లిక్కర్‌ విక్రయాలను తిరిగి ప్రారంభించేందుకు మహా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు […]

లిక్కర్ సేల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్.. కండిషన్స్ అప్లై..!
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 5:39 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం అత్యవసర సేవలకు మినహా.. మిగతా వాటన్నింటిని మూసేశారు. అందులో కిరాణా దుకాణాలకు కూడా మినహాయింపు ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఖజానా పెంచే లిక్కర్‌ విక్రయాలపై కూడా నిషేధం విధించారు. దీంతో అనేక రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుండంతో.. పలు రాష్ట్రాలు మద్యం విక్రయాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మూతపడిన లిక్కర్‌ విక్రయాలను తిరిగి ప్రారంభించేందుకు మహా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో అక్కడ లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి.

ప్రస్తుతం జనం ఇళ్ల నుంచి కేవలం అత్యవసరాల నిమిత్తమే బయటకు వస్తున్నారు. అయితే కొందరు మాత్రం లిక్కర్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ.. ఆత్మహత్యాయత్నాలు కూడా చేసుకుంటున్నారు. మరోవైపు కొందరు మద్యం షాపు యజమానులు అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదాయం కూడా రాష్ట్రాలకు పడిపోవడంతో.. ఇక లిక్కర్ సేల్స్‌ తిరిగి ప్రారంభించాలని పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో మహా సర్కార్‌ తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. అయితే లిక్కర్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్‌ పాటించడంతో పాటు.. మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరి చేయనున్నారు. అయితే మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో పాటు.. మరణాల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది.