మరీ దారుణంగా ‘మహానాయకుడు’ కలెక్షన్లు
ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగంగా తెరకెక్కిన ‘మహానాయకుడు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్ షోతో కేవలం 1,01,460డాలర్లు మాత్రమే సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ జీవీ వెల్లడించారు. కథానాయకుడు 4,82,000డాలర్లు కలెక్ట్ చేయగా.. మహానాయకుడు 1,01,460డాలర్లు కలెక్ట్ చేసిందని ఆయన ట్వీట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. #NTRMahanayakudu collects $101,460 from […]
ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగంగా తెరకెక్కిన ‘మహానాయకుడు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్ షోతో కేవలం 1,01,460డాలర్లు మాత్రమే సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ జీవీ వెల్లడించారు. కథానాయకుడు 4,82,000డాలర్లు కలెక్ట్ చేయగా.. మహానాయకుడు 1,01,460డాలర్లు కలెక్ట్ చేసిందని ఆయన ట్వీట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
#NTRMahanayakudu collects $101,460 from 111 locations in USA on 21 February with per loc average of $914.#NTRKathanayakudu collected $482k (192 loc) for premieres with per location average of $2,512 by releasing on deals Tuesday (1+1 offer on tickets) ??
— idlebrain jeevi (@idlebrainjeevi) February 22, 2019
ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. నాటకీయత ఎక్కువగా ఉండటంతో మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో రెండో భాగంపై అంచనాలు తగ్గిపోయాయి. విడుదల దగ్గర పడుతున్న సమయంలో వచ్చిన టీజర్లు, ప్రోమోలు కాస్త ఆసక్తిని కలిగించినప్పటికీ.. చాలామందికి తెలిసిన ఎన్టీఆర్ కథను అర్ధాంతరంగా ముగించడం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రెండో భాగానికి కూడా భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు.