సింహాలకు గేదె “గుణపాఠం”.. లగెత్తుకుపోయింది “ఆహారం”..!

Lions break out in fight after dragging buffalo to eat. Viral video of what happens next is a lesson for all, సింహాలకు గేదె “గుణపాఠం”.. లగెత్తుకుపోయింది “ఆహారం”..!

నలుగైదింటికి సరిపడా ఆహారం ఉంది. అయితే ఏం లాభం.. తెలివి లేకపోతే. అది ఆఫ్రికా ఖండంలోని క్రుగేర్ జాతీయ పార్క్. అందులో ఉన్న సింహాలు బాగా ఆకలితో ఉన్నాయి. అయితే అదే సమయంలో ఓ బర్రెల గుంపు వాటికి కనిపించింది. సామాన్యంగా మృగరాజులను చూడటంతోనే మిగతా జంతువులు ప్రాణరక్షణ కోసం పరిగెడుతాయి. అది సాదారణమైన విషయమే. అయితే ఓ బర్రె మాత్రం ఆ మృగరాజులకు చిక్కింది. ఇంకేముంది ప్రాణాలపై ఆశలు కోల్పోయింది. ఆ బర్రెను నాలుగైదు సింహాలు బంధించాయి. ఇక అక్కడ ఉన్న ఇతర జంతువులు ఇక బర్రె పని అయిపోయిందనుకున్నాయి. అయితే సింహాల్లో లోపించిన ఐకమత్యం ఆ బర్రెకు ప్రాణబిక్ష చేసినట్టైంది. ఆకలితో ఉన్న ఆ సింహాలు.. బర్రెను ఈడ్చుకొచ్చాయి. ఇక భక్షించేందుకు అన్ని గుమిగూడాయి. అదే సమయంలో ఓ రెండు సింహాల మధ్య ఆదిపత్య పోరు చోటుచేసుకుంది.

ఇంకేముంది.. ఆ రెండింటి మధ్యలోకి మిగతా సింహాలు కూడా ఎంటర్ అయ్యాయి. ఇక ఇదే అదనుగా చూసుకున్న అక్కడ ఉన్న బర్రె మెల్లిగా లేచి పారిపోయింది. ఆ తర్వాత సింహాలు కూడా విచ్చలవిడిగా పరుగెత్తాయి. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *