World Mosquito Day 2025: ఐస్ నుంచి కలబంద వరకు… దోమలు కుట్టినప్పుడు ఈ 7 ఇంటి చిట్కాలను ట్రై చేయండి..

నేడు అంతర్జాతీయ దోమల దినోత్సవం. వర్షాకాలంలో దోమల భయం పెరుగుతుంది. వీధుల నుంచి పార్కులు, ఇంటి ఆవరణలో నీటితో నిండిన ఎక్కడైనా దోమలు సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. దోమలు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అదే సమయంలో, దోమలు కుట్టినట్లయితే అక్కడ చాలా నొప్పి కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో దోమలు కుట్టినట్లయితే ఏ సహజ వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం..

World Mosquito Day 2025: ఐస్ నుంచి కలబంద వరకు... దోమలు కుట్టినప్పుడు ఈ 7 ఇంటి చిట్కాలను ట్రై చేయండి..
World Mosquito Day 2025

Updated on: Aug 20, 2025 | 10:31 AM

ప్రతి సంవత్సరం ఆగస్టు 20న దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దోమల వల్ల కలిగే వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేయడం, వాటిని నివారించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం. ప్రతి సంవత్సరం మలేరియా, చికున్‌గున్యా వంటి కేసులు దేశంలో వస్తుంటాయి. ఇవి దోమ కాటు వల్ల కలిగే వ్యాధులు చాలా తీవ్రమైన రూపాన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో, దోమల భయం ఎక్కువగా కనిపిస్తుంది. వీధుల్లో, పరిసరాల్లోనే కాదు ఇంటి లోపల కూడా దోమలు సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఇబ్బంది పెడుతుంది.

చిన్నగా కనిపించే దోమలు ఎంత గట్టిగా కుడతాయంటే ఆ ప్రదేశంలో మందపాటి ఎర్రటి మచ్చ ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ దద్దురు పిల్లలకు చాలా ప్రమాదకరం. దీని వలన ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయితే కొన్ని సహజమైన విషయాలు ఉన్నాయి. వీటిని దోమ కాటు వేసిన చోట అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది. దోమ కాటువేసిన తర్వాత ఏ వస్తువులను ఉపయోగించి ఉపశమనం కలిగించ వచ్చునో ఈ రోజు మనం తెలుసుకుందాం..

దోమ కాటు తర్వాత ఏమి అప్లై చేయాలంటే
ఐస్ వాడండి- దోమ కుట్టినట్లయితే వెంటనే ఐస్ అప్లై వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ఒక ఐస్ ముక్క తీసుకొని దానిని ఒక గుడ్డలో లేదా టవల్‌లో చుట్టండి. దోమ కుట్టిన ప్రదేశంలో దీన్ని అప్లై చేయండి. ఐస్ వెంటనే చర్మంపై ఎరుపు, దురదను నియంత్రిస్తుంది.

అలోవెరా జెల్- దోమ కాటు తర్వాత ఉపయోగించడానికి అలోవెరా జెల్ అత్యంత ప్రభావవంతమైన జెల్. ఇది చికాకును తగ్గిస్తుంది, దురద నుంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. అలోవెరాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి దురద, మంట, ఎరుపును తక్షణమే తగ్గిస్తాయి.

తేనె కూడా ఉపయోగపడుతుంది- దోమ కాటు విషయంలో తేనె వాడటం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మీరు దోమ కాటు వేసిన ప్రదేశంలో తేనెను పూయాలి. దీనిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

బేకింగ్ సోడా, నీరు- ఈ హోం రెమెడీ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ లా చేసి ప్రభావిత ప్రాంతంపై పూయాలి. ఇది వాపు, దురదను వెంటనే తగ్గించడంలో సహాయపడుతుంది.

టీ బ్యాగులు వాడండి- టీ బ్యాగులు కళ్ళ వాపును తగ్గించడంలో సహాయపడతాయని అందరికీ తెలుసు. అయితే దోమలు కుట్టినప్పుడు కూడా టీ బ్యాగులను ఉపయోగించవచ్చని మీకు తెలుసా? మీరు చేయాల్సిందల్లా చల్లని టీ బ్యాగ్‌ను ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయడం.. కొంత సమయం తర్వాత ఉపశమనం లభిస్తుంది.

పసుపును పూయండి- దోమ కాటు వేసిన ప్రాంతంలో పసుపును పూయడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సహజ ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. పసుపు అనేక రకాల గాయాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. మీరు ప్రభావిత ప్రాంతంపై పసుపును పూయాలి. కొంత సమయంలో దోమకాటు నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)