Periods Care: నెలసరి సమయంలో మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదట!

మహిళల్లో పీరియడ్స్ అనేవి సర్వ సాధారణం. ఇవి నెలనెల వచ్చేదే. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. అందులోనూ ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. నెలసరిలో కొంత మంది లేడీస్‌కి పెయిన్ వస్తుంది. నెలసరి వచ్చే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ సమస్య నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్‌ సమయంలో కొన్ని రకాల పనులు మహిళలు..

Periods Care: నెలసరి సమయంలో మహిళలు ఈ పనులు అస్సలు చేయకూడదట!
Periods
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:45 PM

మహిళల్లో పీరియడ్స్ అనేవి సర్వ సాధారణం. ఇవి నెలనెల వచ్చేదే. అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. అందులోనూ ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. నెలసరిలో కొంత మంది లేడీస్‌కి పెయిన్ వస్తుంది. నెలసరి వచ్చే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ సమస్య నుంచి రిలీఫ్ నెస్ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్‌ సమయంలో కొన్ని రకాల పనులు మహిళలు చేయకూడదట. వాటి వల్ల కూడా నొప్పి అనేది మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తీసుకునే ఆహారం:

పీరియడ్స్ సమయంలో తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాలి. మంచి హెల్దీ అయిన ఆహారం తీసుకోవాలి. అప్పుడే మీరు నెలసరి సమయాన్ని ఇబ్బందిగా ఫీల్ అవరు. అలాగే ఈ సమయంలో చాలా మందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. అలా అని ఎక్కువగా తీపి ఉన్న పదార్థాలు తినకూడదట. ఇది కడుపుపై ప్రభావాన్ని చూపిస్తాయి. అదే విధంగా కెఫిన్ ఉన్న ఆహారాలు కూడా తక్కువగా తీసుకోవాలి.

నీళ్లు:

పీరియడ్స్ సమయంలో నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. చాలా మంది ఇబ్బంది ఉంటుందని నీటిని తక్కువగా తీసుకుంటారు. దీంతో డీ హైడ్రేషన్‌కు గురవ్వడమే కాకుండా.. పొట్ట సమస్యలు కూడా రావచ్చు. అలాగే తలనొప్పి వంటి సమస్యలు కూడా వేధిస్తాయి. కాబట్టి తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. నీటిని సరిగ్గా తీసుకోకపోతే కండరాలు నొప్పి, తిమ్మిరిగా ఉంటాయి. కాబట్టి సరైన విధంగా నీటిని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మెడిసిన్:

చాలా మంది రుతుక్రమంలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి ట్యాబెట్ల్స్ వంటివి వేసుకుంటారు. వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మెడిసిన్స్‌కి బదులు హాట్ పాడ్ లేదా కోల్డ్ ప్యాడ్‌తో నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకూ రెస్ట్ తీసుకోవడం ఉత్తమం.

నిద్ర:

అదే విధంగా సరైన విధంగా నిద్ర పోవాలి. నిద్ర లేని కారణంగా కూడా చికాకుగా, విసుగ్గా, అలసటగా ఉంటుంది. అవసరం అయితే ఆఫీస్‌కు లీవ్ పెట్టి మీరు రెస్ట్ తీసుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్