Foods for Women: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తప్పక తినాల్సిందే!

శరీరం సక్రమంగా పని చేయాలంటే అన్ని రకాల పోషకాలు సక్రమంగా అందాలి. పోషకాలు సరిగ్గా అందితేనే శరీరం ఆరోగ్యం, అందంగా ఉంటుంది. అదే విధంలో శరీరంలో అన్ని రకాల విధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మంది అనేక పోషకాల లోపాలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పోషకాల లోపంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని పలు గణాంకాలు చెబుతున్నాయి. స్త్రీలు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా..

Foods for Women: మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తప్పక తినాల్సిందే!
Foods For Women

Updated on: Jan 24, 2024 | 1:19 PM

శరీరం సక్రమంగా పని చేయాలంటే అన్ని రకాల పోషకాలు సక్రమంగా అందాలి. పోషకాలు సరిగ్గా అందితేనే శరీరం ఆరోగ్యం, అందంగా ఉంటుంది. అదే విధంలో శరీరంలో అన్ని రకాల విధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మంది అనేక పోషకాల లోపాలతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పోషకాల లోపంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని పలు గణాంకాలు చెబుతున్నాయి. స్త్రీలు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటనే ఎలాంటి రోగాలు రాకుండా ఉండొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు స్త్రీలు థైరాయిడ్, క్యాన్సర్, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ లైఫ్ స్టైల్‌లో మార్పులతో పాటు ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. మరి మహిళలు తరుచుగా క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మెగ్నీషియం ఉండే ఆహారాలు..

ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలు ఎక్కువగా పని చేస్తూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీళ్లకు కండరాలు, నరాలు సరిగ్గా పని చేయాలి. అదే విధంగా బలంగా ఉండటం అవసరం. ఆకు కూరలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటివి తినడం వల్ల మెగ్నీషియం అందుతుంది

శరీర బరువును అదుపులో ఉంచాలి..

మహిళలు ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్త్రీల బరువును అదుపులో ఉంచడంలో ఫైబర్ చక్కగా పని చేస్తుంది. కాబట్టి స్త్రీలు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి..

మహిళల్లో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకే త్వరగా రోగాల బారిన పడతారు. అలాంటి వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే విటమిన్ సి ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల వ్యాధుల్ని తట్టుకునే శక్తితో పాటు గాయాలు కూడా త్వరగా నయం అవుతాయి. అదే విధంగా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..

మహిళలు నెలసరి సమయంలో ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతుంది. కాబట్టి చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతూ ఉంటారు. రక్తం సరిగ్గా ఉండాలంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. దీని వల్ల వారు బలంగా ఉంటారు. అంతే కాకుండా క్యాల్షియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.