
Women Health Care Tips: కొంతమంది గర్భవతి స్త్రీల పొట్ట బాగా లావుగా కనిపిస్తుంటుంది. వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. అయితే, అందుకు కారణం స్త్రీలు కూడా కావొచ్చు. చాలా సందర్భాలలో, గర్భిణీ స్త్రీలు తమ కడుపులో ఒకరు కాదు.. ఇద్దరు ఉన్నారని మొదట్లో గుర్తించలేరు. కవలలను సోనోగ్రఫీ ద్వారా మాత్రమే గుర్తించవచ్చు, కానీ మీకు తెలుసా కడుపులో కవలలు ఉంటే.. అందుకు సంబంధించిన లక్షణాలను ప్రారంభంలో కూడా గుర్తించవచ్చు. ఈ లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. రెండు వేర్వేరు స్పెర్మ్‌ల ద్వారా అండాలు ఫలదీకరణం చెందడం ద్వారా కవలలు పుడతారని వైద్యులు చెబుతున్నారు. కడుపులో కవలలు ఉంటే.. గర్భధారణ సమయంలో కూడా దాని లక్షణాలు కనిపించడం జరుగుతుంది. కడుపులో కవలలు ఉన్నట్లయితే.. అప్పుడు సదరు స్త్రీ ఉదయం సమయం అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది. అంటే.. వికారం వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా ఈ లక్షణాలు పీరియడ్స్ మిస్ అయిన రెండో నెలలో కనిపిస్తాయి. ఇది ప్రారంభ లక్షణం. అయితే, చాలా సందర్భాలలో మహిళలు దీనిని గుర్తించలేరు.
డాక్టర్ మంజు గోయల్, లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి గైనకాలజీ విభాగం ప్రకారం.. చాలా కేసుల్లో ఎలాంటి టెస్ట్‌లు చేయించుకోకుండానే మహిళలు తమ గర్భంలో కవలలను మోస్తున్నారు. ఈ విషయం వారికి కూడా తెలియడం లేదు. తమ గర్భంలో కవలలు ఉన్న సమాచారం సోనోగ్రఫీ తర్వాత మాత్రమే తెలిసేందుకు అవకాశం ఉంది. అయితే కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కడుపులో కవల పిల్లలు ఉన్నాయని సూచిస్తాయి. మార్నింగ్ సిక్‌నెస్‌తో పాటు.. రెండవ అతిపెద్ద లక్షణం స్త్రీ బరువు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం. ఒక స్త్రీ ఇద్దరు పిల్లలతో గర్భవతిగా ఉంటే, ఈ కాలంలో ఆమె బరువు పెరుగుతుంది. గర్భధారణ సమయంలో సాధారణ స్త్రీ బరువు 20 కిలోల వరకు పెరుగుతుంది. కవలల విషయంలో అది 30 కిలోల వరకు పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో స్త్రీకి ఎక్కువ ఆకలిగా అనిపిస్తే, కడుపులో ఇద్దరు పిల్లలు ఉండటం ఒక లక్షణం. ఎక్కువ పోషకాహారం అవసరం కారణంగా, స్త్రీ కూడా ఎక్కువ ఆకలితో ఉంటుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే, చాలా ఆకలిగా అనిపిస్తుంది. రోజుకు చాలాసార్లు ఏదైనా తినాలని అనిపిస్తుంది. అయితే, గర్భదారణ సమయంలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం మానుకోవాలి. ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. బయట తినడం మానుకోవాలి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
కవలల విషయంలో.. స్త్రీ చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇద్దరు పిల్లల శరీరాలను పోషించడానికి స్త్రీ శరీరం పని చేయడం వల్ల ఇది జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ స్త్రీ కవలలతో గర్భవతిగా ఉండవచ్చని సూచిస్తుంటాయి. అయితే సోనోగ్రఫీ నుండి ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్టింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..