Jackfruits: కమ్మని పనస తొనలు మధుమేహంతో బాధపడేవారు తినొచ్చా..?

వేసవి రాకతో మామిడి, పనస, నేరేడు వంటి అనేక సీజనల్‌ పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పనస పండు మనందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ముఖ్యంగా ఈ కాలంలో మార్కెట్లో ఘుమఘుమలాడే పనస తొనలు నోరూరిస్తాయి. పనస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు..

Jackfruits: కమ్మని పనస తొనలు మధుమేహంతో బాధపడేవారు తినొచ్చా..?
Jackfruit

Updated on: Mar 22, 2026 | 12:28 PM

వేసవిలో వచ్చే సీజనల్‌ పండ్లలో పనస ఒకటి. వేసవి రాకతో మామిడి, పనస, నేరేడు వంటి అనేక సీజనల్‌ పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పనస పండు మనందరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ముఖ్యంగా ఈ కాలంలో మార్కెట్లో ఘుమఘుమలాడే పనస తొనలు నోరూరిస్తాయి. పనస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల దీనిని ‘ సూపర్‌ఫుడ్’ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పనస పండు ఫైబర్‌కు అద్భుతమైన, సహజమైన మూలం. వేసవిలో పనస పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

పనసను ఎందుకు పోషకాహారంగా పరిగణిస్తారు?

ఆయుర్వేదంలో పనసకాయను బరువైన,నూనె అధికంగా ఉండే కూరగాయగా పరిగణిస్తారు. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే పచ్చి పనసకాయతో రకరకాల వంటకాలు కూడా వండుకుని తింటుంటారు. ఇలా తినడం వల్ల శరీరంలోని వాతాన్ని సమతుల్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. అదేవిధంగా బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు పనసకాయను జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దాని అధిక పోషక విలువలు కారణంగా ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పనస పండు తినడం వల్ల ఏ వ్యాధి నయమవుతుంది?

పనస పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు పనస పండును తినడం ద్వారా శరీరంలోని గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పనస పండును తినడం గుండెకు కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో అధికంగా ఉండే పొటాషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

పనస పండు కడుపుకు మంచిదా?

పనసపండులో పీచుపదార్థం కూడా అధికంగా ఉంటుంది. మలబద్ధకం లేదా పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు పనసపండును తినడం వల్ల పేగులు శుభ్రపడటానికి సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి మలినాలను కూడా త్వరగా తొలగిస్తుంది. కడుపుకు మేలు చేయడమే కాకుండా చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పనసపండులో ఉండే ‘ఎ’, ‘సి’ విటమిన్లు కలిసి చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే పనసపండు అందరికీ మేలు చేయదు. గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి. అలాగే శరీరంలో వాత దోషం ఎక్కువగా ఉంటే, పనసపండు వంటకాలను తక్కువ మసాలాలతో తయారుచేసుకుని పరిమిత పరిమాణంలోనే తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us