రోజుకు ఒక యాపిల్ పండు కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే?
22 March 2026
TV9 Telugu
TV9 Telugu
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని చెబుతుంటారు. అత్యంత పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి
TV9 Telugu
అందుకనే ఈ పండును రోజూ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే రోజుకో యాపిల్ పండును కచ్చితంగా తినాల్సిందేనని సోషకాహార నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
ప్రస్తుతం చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. మలబద్దకం సమస్య నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నారు
TV9 Telugu
దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది అవయవాల ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. మలబద్దకాన్ని నివారించకపోతే దీర్ఘకాలంలో ఇది పైల్స్‌గా మారుతుంది
TV9 Telugu
అప్పుడు సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు యాపిల్ పండు పనిచేస్తుంది. దీన్ని రోజూ తింటే మలబద్దకం తగ్గడమే కాదు, జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది
TV9 Telugu
గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య బాధించదు. అజీర్తి తగ్గుతుంది. చాలా మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు కనుక వీటికి మెడిసిన్లను వాడే బదులు రోజుకు ఒక యాపిల్ పండును తింటే ఎంతో మేలని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ఇక జీర్ణ వ్యవస్థల తరువాత అసలు సమస్య గుండెకు సంబంధించింది. ప్రస్తుతం చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. గతంలో పెద్దలకు మాత్రమే ఇది వచ్చేది. కానీ ఇప్పుడు చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటుతో మరణిస్తున్నారు
TV9 Telugu
అయితే ఇలా కాకుండా ఉండాలంటే రోజుకు ఒక యాపిల్ తినాల్సిందే. యాపిల్ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ అదుపులోకి వస్తుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి మరి