వాచ్‌ ఎప్పుడూ ఎడమ చేతికే ఎందుకు ధరిస్తారు? 99 శాతం మందికి అసలు సీక్రెట్‌ తెలియదు

ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరినా లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా.. చక్కగా దుస్తులు ధరించిన తర్వాత చేయి దానంతట అదే వాచ్‌ వైపు వెళ్తుంది. అనంతరం ఒక్క క్షణం కూడా సంకోచించకుండా మీరు దానిని మీ ఎడమ మణికట్టుకు ధరిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ వాచ్‌ ఎడమ చేతికి మాత్రమే ఎందుకు ధరించడానికి ఇష్టపడతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ వారు తమ వాచ్‌లను కుడి చేతికి ధరిస్తే ఏం జరుగుతుంది? పైకి సాధారణంగా కనిపించే ఈ కొంటే ప్రశ్న వెనుక పెద్ద యుద్ధ చరిత్ర, మానవ స్వభావం, విజ్ఞాన శాస్త్ర తర్కం ఉన్నాయని మీకు తెలుసా?

వాచ్‌ ఎప్పుడూ ఎడమ చేతికే ఎందుకు ధరిస్తారు? 99 శాతం మందికి అసలు సీక్రెట్‌ తెలియదు
Watches On Left Wrist

Updated on: May 16, 2026 | 8:10 PM

గతంలో పురుషులు తమ కోటు జేబుల్లో ‘పాకెట్ వాచీలు’ అని పిలవబడే గడియారాలను ధరించేవారు. అయితే మహిళలు మాత్రం వాటిని మెడలో లాకెట్టులాగా లేదా మణికట్టుకు ఆభరణంగా ధరించేవారు. అయినప్పటికీ 20వ శతాబ్దం ప్రారంభంలో యుద్ధ సమయంలో, సైనికులకు కచ్చితమైన సమయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉండేది. యుద్ధభూమిలో సమయం చూసుకోవడానికి జేబులోంచి గడియారాన్ని బయటకు తీయడం ప్రమాదకరంగా, అసౌకర్యంగా మారింది. అందుకే సైనికులు తమ మణికట్టుకు గడియారాలు ధరించడం ప్రారంభించారు.

చాలామంది సైనికులు ఆయుధాలు ప్రయోగించడానికి తమ కుడి చేతిని ఉపయోగించేవారు కాబట్టి.. వీరు సమయం చూసుకోవడానికి ఆయుధాలు తీయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు తమ ఎడమ చేతికి వాచ్‌ ధరించేవారు. ప్రపంచ జనాభాలో దాదాపు 90 శాతం మంది కుడిచేతి వాటం కలవారు. మనం రాయడానికి, బరువైన వస్తువులను ఎత్తడానికి, సాంకేతిక పనులు చేయడానికి మన కుడి చేతిని ఎక్కువగా ఉపయోగిస్తాం. కుడి చేతికి గడియారం పెట్టుకుంటే పని చేసే క్రమంలో అది దేనికైనా తగిలి, అద్దం పగిలిపోయే లేదా గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బదులుగా ఎడమ చేయి సాపేక్షంగా తక్కువ చురుకుగా ఉంటుంది. అందువల్ల ఖరీదైన గడియారం పాడవకుండా ఉండేదుకు ఎడమ చేయికి వాడటం అలవాటు అయ్యింది.

అనలాగ్ వాచీలలో సమయాన్ని మార్చడానికి లేదా కీని సెట్ చేయడానికి ‘క్రౌన్’ అనే ఒక చిన్న బటన్ ఉంటుంది. ఈ బటన్ వాచ్ డయల్‌కు కుడి వైపున ఉంటుంది. వాచ్‌ను ఎడమ చేతికి ధరించినప్పుడు, కుడి చేతి బొటనవేలి, చూపుడు వేలితో సమయాన్ని సెట్ చేయడం చాలా సులభం. వాచ్‌ను కుడి చేతికి ధరిస్తే, ఈ బటన్ ఎడమ వైపున ఉంటుంది. సమయాన్ని సెట్ చేయడం కష్టంగా ఉంటుంది. నేటి డిజిటల్, స్మార్ట్‌వాచ్ యుగంలో కీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోండి.. అయితే హృదయ స్పందనలు, ఇతర లక్షణాలను కొలిచే సెన్సార్లు ఎడమ చేతిపై మరింత కచ్చితంగా పనిచేసే విధంగా రూపొందించబడ్డాయి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా కుడి చేయి మౌస్‌తో పనిలో నిమగ్నమై ఉండగా ఎడమ చేతితో నోటిఫికేషన్‌లను స్మార్ట్‌ వాచ్‌లో ఒక్క చూపులో చూడటం సులభంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us