AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!

ఈ రోజుల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో చాలామంది తమ ఉదయాన్ని గ్రీన్ టీతో ప్రారంభిస్తున్నారు. బరువు తగ్గడానికి, శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఆయుర్వేదం, వైద్య నిపుణుల ప్రకారం.. గ్రీన్ టీ అందరికీ సురక్షితం కాదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. గ్రీన్ టీని ఎవరు నివారించాలి?

గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!
Green Tea Side Effects
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2026 | 6:00 AM

Share

గ్రీన్ టీని సాధారణంగా ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి ఎంతో మంచిదని భావిస్తారు. అయితే, ఇది అందరికీ అనుకూలంగా ఉండదు. కొంతమంది గ్రీన్ టీని రోజూ లేదా పరిమితికి మించి తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఎవరు గ్రీన్ టీకి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

రక్తహీనత ఉన్నవారు: గ్రీన్ టీలో టానిన్లు అనే కాంపౌండ్లు ఉంటాయి. ఇవి మనం తినే ఆహారం నుంచి శరీరం ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. రక్తహీనతతో బాధపడేవారు లేదా ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.

గర్భవతులు, పాలిచ్చే తల్లులు: గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే సమయంలో ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకుంటే అది పిండం ఎదుగుదలపై లేదా పసిపాప నిద్ర, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ లేదా ఆల్సర్లు ఉన్నవారికి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఆందోళన, నిద్రలేమి ఉన్నవారు: గ్రీన్ టీలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇప్పటికే నిద్రలేమి లేదా తీవ్రమైన ఆందోళన, ఒత్తిడితో బాధపడేవారు దీనిని తాగడం వల్ల నిద్ర భంగం వాటిల్లడం, గుండె వేగం పెరగడం వంటి అసౌకర్యాలు కలగవచ్చు.

ఎముకల బలహీనత ఉన్నవారు: ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మూత్రం ద్వారా శరీరం నుంచి క్యాల్షియం ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. ఇది ఎముకల సాంద్రతను తగ్గించి ఎముకలను బలహీనం చేస్తుంది.

సురక్షితమైన వినియోగం కోసం చిట్కాలు: ఎప్పుడూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. రోజుకు 2 కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం గంట సమయం తర్వాత తాగడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?