AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..!

ఇల్లు నిర్మించేటప్పుడు లేదా కొత్త వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసేటప్పుడు ట్యాంక్ రంగు గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏదో ఒక రంగు ట్యాంక్‌ను తెచ్చి పైన పెట్టేస్తుంటారు. అయితే, వాటర్ ట్యాంక్ రంగు అనేది కేవలం డిజైన్ లేదా ఆకర్షణ కోసం మాత్రమే కాదు, ఆ ట్యాంక్‌లోని నీటి ఉష్ణోగ్రత, శుభ్రత, నాచు పట్టే ప్రక్రియపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రంగుల ట్యాంక్‌లకు ఉండే ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇంటికి కొత్త వాటర్ ట్యాంకర్‌ కొంటున్నారా..? నలుపు, తెలుపు, నీలం.. ఏది మంచిదో తెలుసుకోండి..!
Water Tank Buying GuideImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Jul 24, 2026 | 9:36 PM

Share

ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు సరైన రంగును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. రంగు అనేది కేవలం చూడటానికి మాత్రమే కాక, నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, శుభ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా నలుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగు ట్యాంక్‌లు అందుబాటులో ఉంటాయి.  వాతావరణం, అవసరాలను బట్టి సరైన రంగు ట్యాంక్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. ఏ ట్యాంక్ ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటుంది..ఇంటి అవసరాలకు ఏది బెస్ట్ ఇప్పుడు చూద్దాం..

నలుపు రంగు వాటర్ ట్యాంక్ ప్రయోజనాలు:

నలుపు రంగు సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ట్యాంక్ లోపల నాచు లేదా బ్యాక్టీరియా త్వరగా పెరగవు. నీరు ఎక్కువ కాలం శుభ్రంగా ఉంటుంది. కానీ, నలుపు రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. దీనివల్ల వేసవి కాలంలో ట్యాంక్‌లోని నీరు బాగా వేడెక్కి, వాడటానికి ఇబ్బందిగా మారుతుంది.

తెలుపు రంగు వాటర్ ట్యాంక్ ప్రయోజనాలు:

తెలుపు రంగు సూర్యరశ్మిని పరావర్తనం చేస్తుంది. కాబట్టి ఎండ తీవ్రత ఎంత ఉన్నా ట్యాంక్‌లోని నీరు త్వరగా వేడెక్కదు. సాధారణ ఉష్ణోగ్రతలోనే ఉంటుంది. కానీ, తక్కువ లేయర్లు ఉన్న తెలుపు ట్యాంకుల్లోకి వెలుతురు సులువుగా ప్రవేశిస్తుంది. దీనివల్ల లోపల నాచు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మల్టీలేయర్ UV ప్రొటెక్షన్ ఉన్న తెలుపు ట్యాంకులను ఎంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

నీలం లేదా ఆకుపచ్చ రంగు ట్యాంకులు: ఇవి నలుపు, తెలుపు రంగుల మధ్యస్తంగా పనిచేస్తాయి. సూర్యరశ్మిని కొంతవరకు అడ్డుకుంటూనే, నీరు మరీ ఎక్కువగా వేడెక్కకుండా చూస్తాయి. ఇవి చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

అయితే, మీ ప్రాంతంలో ఉండే ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతను బట్టి ట్యాంక్ రంగును నిర్ధారించుకోవాలి. ఏ రంగు ట్యాంక్ ఎంచుకున్నా సూర్యరశ్మి లోపలికి వెళ్లకుండా కనీసం 3-4 లేయర్లు ఉన్న ట్యాంక్ ఎంచుకోవాలి. ట్యాంక్‌కు UV స్టెబిలైజ్డ్ కోటింగ్ ఉందో లేదో సరిచూసుకుని కొనుగోలు చేయాలి. అలాగే, మీ ప్రాంతంలో వేసవిలో నీరు చల్లగా ఉండాలి అనుకుంటే త్రిబుల్ లేదా ఫోర్ లేయర్ల తెలుపు రంగు ట్యాంక్ బెస్ట్. ఒకవేళ ట్యాంక్ తరచూ శుభ్రం చేయడం కుదరదు, నాచు పట్టకూడదు అనుకుంటే నలుపు లేదా నీలం రంగు ట్యాంక్‌ను ఎంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో ఈ సీన్లు ఎలా తీశారు?
VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో ఈ సీన్లు ఎలా తీశారు?
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు