పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి

రోజంతా పడిన అలసట తీరి శరీరం రీఛార్జ్ అవ్వాలంటే రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర ఎంతో అవసరం. అయితే చాలామంది నిద్రపోయే సమయానికి ఇచ్చే ప్రాధాన్యతను, తమ పడుకునే పొజిషన్ పై చూపించరు. కొందరు వెల్లకిలా, మరికొందరు పొట్టపై లేదా పక్కకు తిరిగి నిద్రపోతుంటారు. అసలు ఏ పొజిషన్‌లో పడుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది? అనేది తెలుసుకుందాం..

పక్కకు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? ఎలా నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి
Best Sleeping Position For Health

Updated on: Aug 08, 2026 | 12:34 PM

ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం, వ్యాయామం ఎంత అవసరమో.. తగినంత ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే చాలామంది నిద్రపోయే సమయానికి ఇచ్చే ప్రాధాన్యతను, పడుకునే విధానంపై చూపించరు. కొందరు వెల్లకిలా పడుకుంటే, మరికొందరు పొట్టపై లేదా పక్కకు తిరిగి పడుకుంటారు. నిజానికి మనం పడుకునే పొజిషన్ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆరోగ్యానికి ఏ పొజిషన్ ఉత్తమం?

సాధారణంగా పక్కకు తిరిగి పడుకోవడం చాలామందికి అత్యంత సురక్షితమైనది నిపుణులు భావిస్తారు.పక్కకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసనాళాలు ఫ్రీగా తెరుచుకుని ఉంటాయి. దీనివల్ల నిద్రలో గురక, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గర్భధారణ చివరి నెలల్లో ఉన్న మహిళలు పక్కకు తిరిగి పడుకోవడం వల్ల తల్లికి, గర్భంలో పెరిగే బిడ్డకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అయితే భుజాల నొప్పులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యులు వారి శరీర పరిస్థితిని బట్టి తగిన పొజిషన్‌ను సూచిస్తారు.

వెల్లకిలా, పొట్టపై పడుకుంటే వచ్చే సమస్యలు ఏంటి?

వెల్లకిలా పడుకోవడం: ఈ పొజిషన్‌లో పడుకోవడం వల్ల కొంతమందికి శ్వాసనాళాలపై ఒత్తిడిరిగి గురక, స్లీప్ ఆప్నియా సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.

పొట్టపై పడుకోవడం : ఈ విధానంలో నిద్రపోవడం వల్ల మెడను ఒకవైపునకు తిప్పాల్సి వస్తుంది. దీనివల్ల మెడ, వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి పడి మెడ, భుజాలు లేదా వీపు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది.

సుఖ నిద్ర కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు..

ఆరామదాయకమైన పడక: సరిగ్గా అమరే సరైన దిండు, సౌకర్యవంతమైన పరుపును ఉపయోగించండి.

నిద్ర వేళలు: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి.

స్క్రీన్ టైమ్ తగ్గించండి: నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ స్క్రీన్‌లకు దూరంగా ఉండటం మంచిది.

ఆహార నియమాలు: రాత్రి సమయంలో ఎక్కువ భోజనం చేయడం లేదా ఎక్కువగా కేఫీన్ తీసుకోవడం నిద్రను పాడు చేస్తుంది.

మీరు ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పట్టకపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సరైన నిద్ర పొజిషన్‌తో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినప్పుడే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us