Oil for Baby Massage: పిల్లలకు మసాజ్ చేయడానికి ఏ ఆయిల్ అయితే మంచిది?

నవజాత శిశువులకు మసాజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా మసాజ్ చేయడం వల్ల పిల్లల కండరాలు, ఎముకలు ఎంతో బలంగా, దృఢంగా తయారవుతాయి. పిల్లల స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అరుగుదల శక్తి సైతం పెరుగుతుంది. వారిలో జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి కూడా సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. నవ జాత శిశువులకు ప్రతి రోజూ రెండు, మూడు సార్లు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. […]

Oil for Baby Massage: పిల్లలకు మసాజ్ చేయడానికి ఏ ఆయిల్ అయితే మంచిది?
Oil for Baby Massage

Updated on: Jun 25, 2024 | 2:26 PM

నవజాత శిశువులకు మసాజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇలా మసాజ్ చేయడం వల్ల పిల్లల కండరాలు, ఎముకలు ఎంతో బలంగా, దృఢంగా తయారవుతాయి. పిల్లల స్కిన్ టోన్ కూడా మెరుగు పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అరుగుదల శక్తి సైతం పెరుగుతుంది. వారిలో జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి కూడా సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. నవ జాత శిశువులకు ప్రతి రోజూ రెండు, మూడు సార్లు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. పిల్లలకు మసాజ్ చేయడం ఎంత ముఖ్యమో.. అందుకు ఉపయోగించే నూనె కూడా అంతే ముఖ్యం. ఆ ఆయిల్ అనేది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించకపోయినా.. పరోక్షంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఆయిల్ వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి నవ జాత శిశువులకు ఎలాంటి ఆయిల్‌తో మసాజ్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె:

చాలా మంది పిల్లలకు ఆవాల నూనెతో మసాజ్ చేస్తారు. కానీ ఈ నూనెలో వేడి చేసే గుణం ఉంది. కాబట్టి ఈ నూనెతో మసాజ్ చేయకపోవడమే మంచిది. పిల్లలకు గాఢత ఎక్కువగా ఉండే నూనె కంటే. లైట్ వెయిట్ గా ఉండే ఆయిల్ మంచిది. అయితే ఈ ఆయిల్ వర్షాకాలం, వింటర్ సీజన్‌లో ఎక్కువగా ఉపయోగించవచ్చు.

కొబ్బరి నూనె:

సాధారణంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి ముసలి వారు అయ్యేంత వరకూ ఎక్కువగా ఉపయోగించేది కొబ్బరి నూనె. కాబట్టి నవ జాత శిశువుల బాడీ మసాజ్‌కు ఈ ఆయిల్ చాలా మంచిదని చెప్పొచ్చు. అయితే ఈ ఆయిల్ కల్తీ లేకుండా చూసుకోవాలి. ఆ ఆయిల్‌లో మాయిశ్చరైజింగ్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. చర్మం చాలా సాఫ్ట్‌గా, కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. చర్మం త్వరగా పొడి బారగుండా చేస్తుంది. డైపర్ దద్దుర్లను కూడా సహజంగా నయం చేస్తుంది. ఈ ఆయిల్ ఏ సీజన్‌లో అయినా యూజ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనె:

పిల్లల మసాజ్‌కు ఎక్కువగా చాలా మంది ఉపయోగించే ఆయిల్ నువ్వుల నూనె. ఈ ఆయిల్ కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆయిల్‌లో కూడా పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇందులో కూడా మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మాన్ని సాఫ్ట్‌గా, కాంతివంతంగా చేస్తుంది. ఈ ఆయిల్ కూడా ఏ సీజన్‌లో అయినా ఉపయోగించవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..