మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు? తెలివైన వాళ్లు మాత్రమే చెప్పగలరు

Famous Door Puzzle: మీరొక గదిలో బంధించబడ్డారు. బయటపడాలంటే మూడు తలుపుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒక తలుపు వెనుక విషపూరిత కీటకాలు, మరొకదాని వెనుక భారీ పాములు, ఇంకొకదాని వెనుక సింహం ఉన్నాయి. మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఏ డోర్ ఓపెన్‌ చేస్తారు? అనేదే అసలు ప్రశ్న. ఈ ఫజిల్‌కు సమాధానం చెప్పడంలో చాలా మంది విఫలమయ్యారు. ఇప్పుడు మీ వంతు. తెలివిగా ఆలోచించి సరైన సమాధానం చెప్పండి. తద్వారా మీ బ్రెయిన్‌ ఎంత షార్ప్‌ అనేది పరీక్షించుకోండి..

మూడు తలుపులు.. ఒకటే సురక్షితం! మీరైతే ఏ డోర్ తెరుస్తారు? తెలివైన వాళ్లు మాత్రమే చెప్పగలరు
Classic Door Puzzle

Updated on: Jun 08, 2026 | 7:00 PM

మీరు ఒక గదిలో చిక్కుకుపోయారు. బయటకు వెళ్లడానికి మీ ముందున్న మూడు తలుపుల్లో ఒకదాన్ని మాత్రమే తెరవాలి. ఈ కింది మూడు గదుల్లో మూడు రకాల ప్రమాదాలు ఉన్నాయి. వాటిల్లో మీరు బయటపడేందుకు ఏ తలుపు తీస్తారనేదే చిక్కుప్రశ్న.

  • డోర్ 1: ప్రమాదకరమైన కీటకాలతో నిండి ఉంది.
  • డోర్ 2: 5 నెలల కుండా ఏమీ తినకుండా ఉన్న భారీ పాములు ఉన్నాయి.
  • డోర్ 3: 3 వారాల నుంచి ఏమీ తినకుండా ఆకలితో ఉన్న సింహం ఉంది.

మీరు బయటకు వెళ్లేందుకు ‘వీటిలో ఏ డోర్ ఓపెన్ చేస్తారు?’

సాధారణంగా చాలా మంది మొదటి లేదా రెండో తలుపును ఎంచుకుంటారు. ఎందుకంటే సింహం అత్యంత ప్రమాదకరమని భావిస్తారు. సింహం వంటి ప్రమాదకర జంతువుతో పోల్చితే పాములు, కీటకాలు వంటి వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహం నేరుగా దాడి చేసే ప్రమాదం ఉంది. అయితే పాములు కూడా ప్రాణాంతకంగా కాటేయవచ్చు. కీటకాలున్న గదిలో అడుగు పెడితే అవి కుడతాయి. విరుగుడు మందులు కూడా అందుబాటులో ఉండవు. కాబట్టి బయటపడే అవకాశం సింహంతో పోల్చితే మొదటి 1, 2 గదుల్లో ఎక్కువగా ఉంటుందని ఈ ఫజిల్‌ చూసిన వారంతా భావిస్తారు. నిజానికి సమాధానం ఇది కాదు. ఈ రకమైన పజిల్స్‌లో సాధారణంగా ఒక అదనపు సమాచారం దాగి ఉంటుంది. అదే అసలు లాజిక్..

అసలు సమాధానం ఏంటంటే..?

డోర్ నంబర్ 3 (సింహం ఉన్న తలుపు)నే సరైన సమాధానం. ఎందుకుంటే పాములు తిండిలేకుండా 6 నెలల వరకు జీవించగలవు. ఇక్కడ సింహం 3 వారాలుగా ఆహారం తినకుండా అక్కడ బంధించబడి ఉంది. అదే సింహం తిండి లేకుండా 2 వారాలకు మించి ఉండలేదు. ఎక్కువకాలం ఆహారం లేకపోవడంతో అది అప్పటికే చనిపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి సింహం ఉన్న తలుపు తెరవడం సురక్షితమైన ఎంపిక.

ఇవి కూడా చదవండి

ఈ పజిల్ నీతి..

ఈ ఫజిల్‌ ఉద్దేశం నేరుగా కనిపిస్తున్న ప్రమాదాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం కాదు. ప్రశ్నలో దాగి ఉన్న సూచనలను గుర్తించి, తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షించడం. ఈ లాజిక్ మన నిత్య జీవితంలోనూ వాడాలి. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తెలివిగా తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని రక్షిస్తాయి.

Follow Us