Paschimottanasana : మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులతో శారీరక శ్రమ తగ్గింది. అందుబాటులోకి వచ్చిన యంత్రాల మూలంగా మనిషి శారీరక కండరాలకు వ్యాయామం లేకుండా పోయింది. కీళ్ళు కదిలించాల్సిన అవసరం తగ్గిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్ధితుల్లో నడక గొప్ప వ్యాయామంగా మారిపోయింది.
యోగా చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాయామం. ఈ యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. యోగా వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయి వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుంచే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉండి ప్రయోజనం ఇస్తుంది. మనం బరువు తగ్గడానికి ఉపయోగపడే యోగాసనాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం..
సులభంగా బరువు తగ్గించే సమర్ధవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. భుజాలలో బలాన్ని పెంచుతుంది. మోకాలి కీళ్ళను బలోపేతం చేస్తుంది.
ముందుగా రిలాక్స్ గా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి.
తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి.
అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు.. అయితే రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.
Also Read :