పొద్దు పొద్దున్నే అరటి పండు తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదేనట! తప్పక తెలుసుకోండి..

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో ఒకటి. అంతేకాదు.. అన్ని సీజన్లు, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది అరటి పండు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అరటి పండును ఇష్టంగా తింటారు. చాలా మంది ఉదయం అల్పాహారం ముందు లేదా ఖాళీ కడుపుతో అరటిపండు తినే అలవాటు పెట్టుకుంటారు. కానీ, పోషక నిపుణుల ప్రకారం, ఉదయం అరటిపండు తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తప్పక తెలుసుకోవాలి.

పొద్దు పొద్దున్నే అరటి పండు తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదేనట! తప్పక తెలుసుకోండి..
Eat Banana Early In The Morning

Updated on: Mar 06, 2026 | 12:16 PM

అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం ఇందులో సమృద్దిగా ఉంటాయి. దీని వలన జీర్ణశక్తి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవగానే అరటి పండు తినడం మంచిదేనా ? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియంతో పాటు అరటి పండులో నేచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన బీపీ పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో కూడా అరటిపండు ఉపయోగపడుతుంది.

ఉదయాన్నే అరటిపండు తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది సహజమైన చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్) కలిగి ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా అరటిపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు సక్రమంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది మంచి పరిష్కారంగా ఉంటుంది. ఉదయం అరటిపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యానికి కూడా అరటిపండు ఉపయోగకరం. ఇందులో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉండటంతో ఇది శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మూడ్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ C, విటమిన్ B6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే అరటి పండు తినడం వలన ఇన్‌స్టాంట్ ఎనర్జీ లభిస్తున్నప్పటికీ ఆరోగ్యనిపుణులు ఇది మంచిది కాదని తెలిపారు. ఉదయాన్నే అరటి పండు తినడం వలన యాసిడిటీ సమస్య రావచ్చని చెబుతున్నారు. ఉదయాన్నే అరటి పండు తినడం వలన తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం లెవల్స్ సమృద్దిగా ఉంటాయి. అరటి పండులో తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ, అధికంగా తినడం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువగా అరటిపండ్లు తినడం మంచిది కాదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ లేదా ఆమ్లత్వ సమస్యలు ఉన్నవారు పరిమితంగా తినడం మంచిది. మొత్తానికి ఉదయం ఒక అరటిపండు తినడం శరీరానికి శక్తి, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే సమతుల ఆహారంతో పాటు తీసుకుంటే మరింత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్నిలైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us