Coconut: జ్ఞాపకశక్తి కావాలా నాయనా? అయితే కొబ్బరిని ఓ పట్టుపట్టండి..

ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్ధాల్లో కొబ్బరి ముఖ్యమైనది. ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి. 100 గ్రాముల పచ్చికొబ్బరిలో 354 కెలొరీల శక్తి ఉంటుంది. పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు ఇందులో..

Coconut: జ్ఞాపకశక్తి కావాలా నాయనా? అయితే కొబ్బరిని ఓ పట్టుపట్టండి..
Coconuts

Updated on: Oct 10, 2025 | 1:54 PM

కొబ్బరి బోండాం నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇందులోని కొబ్బరి కూడా ఎన్నోరకాలుగా మేలు చేస్తుంది. నిజానికి, ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్ధాల్లో కొబ్బరి ముఖ్యమైనది. ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి. 100 గ్రాముల పచ్చికొబ్బరిలో 354 కెలొరీల శక్తి ఉంటుంది. పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, కాపర్‌ లాంటి ఖనిజాలు ఇందులో దండిగా ఉంటాయి.

కొబ్బరి బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొబ్బరి శరీరానికి శక్తిని అందించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ పండు చాలా పోషకమైనది. దీనిలోని సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వు త్వరగా శక్తిని అందిస్తుంది. చాలా మంది కొబ్బరిని మధ్యాహ్నం స్నాక్‌గా కూడా తింటారు. ఇది శరీరానికి ఫైబర్ అవసరాన్ని తీరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు చాలా మంచివి. అంతేకాకుండా కొబ్బరి తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది.

కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని పిల్లలు, పెద్దలు, మహిళలు… అందరూ తినొచ్చు. కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నికడగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఇది వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. కొబ్బరి మూత్ర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వంటలలో కొబ్బరి లేకుండా ఏ వంట పూర్తికాదు. ఇక కొబ్బరి నుంచి తీసే నూనె శరీరానికి మేలు చేయడమే కాకుండా ఈ నూనెను పూయడం వల్ల జుట్టు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.