Weight Loss Tips : అధిక బరువు కారణంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే చాలా మంది తమ బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, వ్యాయామం, యోగా తదితర కార్యక్రమాలు చేపడుతారు. అయితే, జీవన శైలిలో మార్పు కారణంగానే బరువు పెరుగుతున్నారనే విషయాన్ని మాత్రం గమనించరు. ఇది గమనించి.. రోజూ వారీ జీవన శైలిని క్రమబద్ధీకరించుకుంటే అధిక బరువును సునాయాసంగా తగ్గొచ్చు. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు కూడా. ఇదిలాఉంటే.. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా రోజూ పాటిస్తే బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నీరు..
ప్రతీ రోజూ ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఉదయాన్నే నీరు త్రాగడం చాలా ఉపయోగకరం. రోజంతా శక్తిని కలిగి ఉండటానికి ఉదయాన్నే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.
ఎక్కువగా నీరు తాగాలి..
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎక్కువ నీరు తాగడం వలన కూడా బరువు తగ్గుతారట. నీరు అధికంగా తాగడం వల్ల ఆకలి వేయకుండా ఉంటుంది. అంతేకాదు.. కడుపు నిండుగా ఉండటం వలన తక్కువగా తింటారు. ఫలితంగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం..
ఉదయం తినే ఆహారం రోజంతా చురుకుగా, చలాకీగా ఉండేందుకు ఉపకరిస్తుంది. అందుకే ఉదయం సమయంలో తినే అల్పాహారాన్ని ముఖ్యమైన ఆహారంగా పరిగణిస్తారు. అయితే, మీరు తినే అల్పాహారంలో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రోజుంతా ఆకలివేయదు. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. దాంతో బరువు తగ్గుతుంది.
చిరుతిళ్లకు దూరం అవ్వండి..
రోజంతా పని చేసే వారిలో శక్తి తగ్గుతుంది. దాంతో ఆకలిగా అనిపిస్తుంటుంది. అయితే, ఆకలివేసినప్పుడు చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తినండి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం వలన మీలోని మెటబాలిజంను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడుతాయి.
వ్యాయామం తప్పనిసరి..
ప్రతీ రోజూ ఉదయాన్ని వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. వ్యాయామం, శారీరక శ్రమ మీ దినచర్యలో భాగంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం సమయంలో పని చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివలన శరీర బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.
Also read:
Mantralayam: 2వేల కోట్లతో మంత్రాలయంలో అభివృద్ధి పనులు.. గంగా నదిలా తుంగభద్రని శుభ్రం చేస్తామంటూ…
Hyderabad: ఇందిరాపార్క్‌లోకి వారికి నో ఎంట్రీ.. క్షణాల్లో వైరల్ అయిన ప్లెక్సీ.. మరికాసేపటికే మాయం..