Socks Side Effects: ఎక్కువ సేపు సాక్స్ వేసుకుని ఉంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!

మారిన జీవన విధానం కారణంగా.. మనం కూడా మారాల్సి వస్తుంది. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురువుతున్నాయి. లైఫ్ స్టైల్‌లో, తినే ఆహారం విషయంలో అనేక మార్పుల కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. చిన్న చిన్నవే అయినా వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలుగా దారి తీస్తాయి. ఇలా సాక్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా ఉద్యోగస్తులు, స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఎక్కువగా సాక్సులు..

Socks Side Effects: ఎక్కువ సేపు సాక్స్ వేసుకుని ఉంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
Socks Side Effects
Follow us

|

Updated on: Apr 01, 2024 | 4:54 PM

మారిన జీవన విధానం కారణంగా.. మనం కూడా మారాల్సి వస్తుంది. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురువుతున్నాయి. లైఫ్ స్టైల్‌లో, తినే ఆహారం విషయంలో అనేక మార్పుల కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. చిన్న చిన్నవే అయినా వాటిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలుగా దారి తీస్తాయి. ఇలా సాక్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా ఉద్యోగస్తులు, స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఎక్కువగా సాక్సులు వేసుకుంటూ ఉంటారు. ఓ 8 గంటలైనా వీరు సాక్సులను ధరిస్తూ ఉంటారు. కానీ సాక్సులను ఎక్కువ సేపు వేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపారు. మరి ఎక్కువ సేపు సాక్సులు ధరించడం ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.

బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు:

సాక్సులను ఎక్కువ సేపు ధరించడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాళ్లకు సాక్సులు ఎక్కువ సేపు ఉంచడం వల్ల చెమట బాగా పడుతుంది. దీంతో బ్యాక్టీరియా సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో పాదాలపై పుండ్లు, వాపులు వంటివి రావచ్చు.

రక్త ప్రసరణ సరిగ్గా జరగదు:

సాక్సులు ఎక్కువ సేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు ఆటకం ఏర్పడవచ్చు. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అనేక సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా తిమ్మిర్లు, వాపులు కూడా వస్తాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో వేడి పెరుగుతుంది:

సాక్సులను ఎక్కువ సేపు ధరించడం వల్ల శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. కాళ్లల్లో కూడా వేడి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఈ వేడి రక్త నాళాలకు కూడా విస్తరిస్తుంది. దీంతో చాలా రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

నిద్ర సమస్యలు:

చాలా మంది పడుకునే ముందు కూడా సాక్సులను ధరిస్తూ ఉంటారు. ఎక్కువగా చలిగా ఉండే సమయలో ఇలా చేస్తారు. ఒక రకంగా సాక్సులు వేసుకుని పడుకోవడం మంచిదే అయినా.. ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. నిద్రకు ఆటంకంగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సాక్సులను తీసుకుంటూ ఉండవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాలకు గాలి కూడా తగులుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.