Keto Diet Plan: శాకాహారులు బరువు తగ్గడానికి కీటో డైట్‌ని ఫాలో అవుతున్నారా.. వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..

|

Nov 21, 2024 | 5:18 PM

బరువు తగ్గడానికి చాలా రకాల పద్దతులు.. వివిధ రకాల ఆహార డైట్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి కీటో డైట్. ఈ డైట్ విధానంలో అతితక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. కనుక కీటో డైట్ ను ఎంపిక చేసుకున్న వారు శాఖాహార ఆహారాన్ని తీసుకోవడం మంచి ఎంపిక.

Keto Diet Plan: శాకాహారులు బరువు తగ్గడానికి కీటో డైట్‌ని ఫాలో అవుతున్నారా.. వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..
Vegetarian Keto Diet Plan
Follow us on

బరువు పెరగడం వల్ల ఇష్టమైన దుస్తులు ధరించలేకపోవడం, శరీర ఆకృతి సక్రమంగా కనిపించకపోవడం తదితర కారణాల వల్ల కొందరిలో విశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాదు బరువు పెరగడం వల్ల రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. దీంతో వేగంగా బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల డైట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు. వీటిలో కీటో బాగా ప్రాచుర్యం పొందింది. కీటో డైట్‌లో, 65 నుంచి 70 శాతం మంచి కొవ్వు, 20 నుంచి 25 శాతం ప్రోటీన్లు, 5 శాతం కార్బోహైడ్రేట్లు మాత్రమే శరీరానికి అందే నిష్పత్తిలో ఆహారాలను తీసుకుంటారు. కార్బోహైడ్రేట్లు శక్తిని అందించడానికి పని చేస్తాయి.. కీటో డైట్ వలన శరీరానికి కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. దీంతో ఆహారంలో లభించే కార్బోహైడ్రేట్లు బదులుగా శరీరం కొవ్వు నుంచి శక్తిని పొందుతుంది. కనుక కీటో డైట్ లో తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా శరీరానికి కొవ్వుతో పాటు మంచి పరిమాణంలో పోషకాలు అందుతాయి.

శాకాహారులు కీటో డైట్‌ని అనుసరించాలనుకుంటే తినే డైట్‌లో ఏ ఆహారాలను చేర్చుకోవచ్చో తెలుసుకోండి. తద్వారా పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇతర పోషకాలతో పాటు ప్రోటీన్, కొవ్వు కూడా శరీరానికి అందుతుంది.

ఏ నూనె తీసుకోవాలంటే

కీటో డైట్‌లో శరీరానికి కొవ్వు ఉన్న పదార్ధాలు అవసరం. కనుక ఈ డైట్ పాటించే వారు ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, వెన్న, కొబ్బరి నూనెను వంటలో ఉపయోగించాలి. ఈ నూనెలు అధిక బరువు ఉండవు. పోషకాలు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ కోసం ఏ ఆహారాన్ని తీసుకోవాలంటే

శరీరంలో ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయడానికి కీటో డైట్‌ని అనుసరించే వ్యక్తులు తమ ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి. ఇందులో గ్రీక్ యోగర్ట్, హెవీ క్రీమ్, చీజ్, పెరుగు, స్ట్రింగ్ చీజ్, పర్మేసన్ చీజ్ మొదలైన వాటిని డైట్‌లో చేర్చుకోవచ్చు.

మంచి కొవ్వు , ప్రోటీన్ వస్తువులను స్నాక్స్‌గా తినండి

కీటో డైట్ అనుసరించే సమయంలో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ కోసం హాజెల్ నట్స్, బాదం, వాల్ నట్స్, మకాడమియా నట్స్, పెకాన్ నట్స్ మొదలైన వాటిని డైట్ లో చేర్చుకోవాలి. అంతే కాదు అవిసె గింజలు, చియా గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు మొదలైన కొన్ని సీడ్స్ ను తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిని తినడం వలన శరీరానికి విటమిన్ ఇ, సహా అనేక ఇతర పోషకాలు మంచి పరిమాణంలో లభిస్తాయి.

ఏ పండ్లను తినాలంటే

కీటో డైట్‌ని అనుసరించే వారు అవోకాడో, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీస్, నిమ్మకాయ వంటి పండ్లను తాము రోజువారీ తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే అనేక పోషకాలకు మంచి మూలం.

ఏ కూరగాయలు తినాలంటే

బరువు తగ్గడానికి కీటో డైట్ పాటిస్తున్నట్లయితే క్యాలీఫ్లవర్, పాలకూర, గోంగూర, పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యాబేజీ మొదలైన కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోవాలి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.