Skin Care: ఇకపై బ్యూటీషియన్స్, మసాజ్ సెంటర్లు అక్కర్లేదు.. ఈ ఒక్క పరికరం ఉంటే చాలు..

అందం ఎవరు కోరుకోరు. ఇది అసలే కాస్మొటిక్ యుగం. చిన్నపాటి ఈవెంట్లకే గ్లామర్ కోసం తెగ హైరానా పడిపోతూ ఉంటారు. అలాంటిది పెద్ద పార్టీలు, పెళ్లి వేడుకలైతే ఇక చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ను నియమించుకుంటున్నారు. అలాంటి వాటికి చెక్ పెడుతూ సరికొత్త పరికరం మార్కెట్లోకి వచ్చేసింది. అందం కావాలనుకునే వారి ఇంటి తలపు తడుతుంది. ఇది చూసేందుకు దువ్వెన ఆకారంలో ఉంది.

Skin Care: ఇకపై బ్యూటీషియన్స్, మసాజ్ సెంటర్లు అక్కర్లేదు.. ఈ ఒక్క పరికరం ఉంటే చాలు..
Multi Attachment Face Scalp Care Device

Updated on: Jan 24, 2024 | 1:54 PM

అందం ఎవరు కోరుకోరు. ఇది అసలే కాస్మొటిక్ యుగం. చిన్నపాటి ఈవెంట్లకే గ్లామర్ కోసం తెగ హైరానా పడిపోతూ ఉంటారు. అలాంటిది పెద్ద పార్టీలు, పెళ్లి వేడుకలైతే ఇక చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ను నియమించుకుంటున్నారు. అలాంటి వాటికి చెక్ పెడుతూ సరికొత్త పరికరం మార్కెట్లోకి వచ్చేసింది. అందం కావాలనుకునే వారి ఇంటి తలపు తడుతుంది. ఇది చూసేందుకు దువ్వెన ఆకారంలో ఉంది. దీని పని తీరు చేస్తూ ఔరా అనాల్సిందే. కేవలం తలకు మాత్రమే కాదు.. ముఖానికి, శరీరం మొత్తం ఉండే చర్మానికీ బహు ప్రయోజనకరంగా ఉంటుంది. అటు కురులను ఇటు దేహాన్ని, ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. దీనిని మల్టీ–అటాచ్మెంట్‌ ఫేస్‌ స్కాల్ప్‌ కేర్‌ డివైస్‌ అంటారు. పలికేందుకు కాస్త వింతగా ఉన్నా పరితీరులో మాత్రం పిచ్చెక్కిస్తుంది. 3 గంటల పాటు చార్జింగ్‌ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు.

ఇక దీని ధర గురించి చెప్పుకుంటే.. 911 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 75,005 అనమాట. క్వాలిటీ, రివ్యూస్‌ ఆధారంగానే ఇలాంటి డివైస్‌లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పరికరం ఎల్‌ఈడీ లైటింగ్‌తో, ఎలక్ట్రికల్‌ మజిల్స్‌ స్టిమ్యులేషన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఉపయోగించేటప్పుడు వైబ్రేషన్‌ వస్తుంది. అయితే దీనికి ఉన్న మూడు వేరు వేరు హెడ్స్‌ని అవసరాన్ని బట్టి అటాచ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఇది చర్మాన్ని ముడతలు, మచ్చలు లేకుండా మృదువుగా మారుస్తుంది. యవ్వనం తిరిగి వస్తుంది. అలాగే తలకు మసాజ్‌ చేస్తూ.. వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇలా అనేక రకాలుగా సౌందర్యం కోరుకునేవారికి ట్రీట్‌మెంట్‌ని అందిస్తుంది.

కేవలం అందానికే కాకుండా కండరాలను ఉత్తేజపరచేందుకు కూడా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న నొప్పులు తగ్గించుకునేందుకు మల్టీ హెడ్‌ (బాల్స్‌ అటాచై ఉన్న భాగం)ను ఈజీగా డివైస్‌కి అమర్చుకుంటే సరిపోతుంది. ఈ బ్యూటీ టూల్లో.. ‘లో/మీడియం/ హై’ ఆప్షన్స్‌ ఉంటాయి. స్కాల్ప్, ఫేస్, మల్టీ అనే మూడు హెడ్స్‌ని అవసరానికి మార్చుకునే వీలుండటంతో దీనికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వీటిని ఉపయోగించేటప్పుడు డర్మటాలజిస్ట్ లను సంప్రదించి వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..