Hair Care: జుట్టు ఊడుతుందని బాధపడుతున్నారా..? ఈ హెయిర్ ఆయిల్స్‌తో వెంటనే పరిష్కారం.. ట్రై చేయండి..

|

Dec 04, 2022 | 10:01 AM

చలికాలంలో చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటుంటారు. తరచూ జుట్టు పొడిబారడాన్ని ఎదుర్కొంటుంటారు. జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది.

Hair Care: జుట్టు ఊడుతుందని బాధపడుతున్నారా..? ఈ హెయిర్ ఆయిల్స్‌తో వెంటనే పరిష్కారం.. ట్రై చేయండి..
Hair Care
Follow us on

చలికాలంలో చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటుంటారు. తరచూ జుట్టు పొడిబారడాన్ని ఎదుర్కొంటుంటారు. జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంటుంది. నూనె.. జుట్టుకు మంచి పోషణగా పనిచేస్తుంది. దీనిలో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జట్టును బలంగా మార్చడంలో సహాయపడతాయి. నూనెతోపాలు పలు పదార్థాలను ఉపయోగించి.. మర్దన చేయడం వల్ల తలలో మంట దూరమవుతుంది. జుట్టును బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు చిక్కుపడకుండా నివారించి.. శిరోజాలను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా చుండ్రు, దురద సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. శీతాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ఎలాంటి హెయిర్ ఆయిల్‌ని ఉపయోగించాలి.. వాటితో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నూనెలతో జుట్టుకు మేలు..

  1. ఆలివ్ నూనె: ఆలివ్ ఆయిల్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టు పాడవకుండా కాపాడుతుంది. ఇంకా తలకు పోషణనిస్తుంది. మీరు ఆలివ్ నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దానికి తేనె, ఆలివ్ నూనె జోడించండి. వీటన్నింటిని మిక్స్ చేసి జుట్టు, తలకు అప్లై చేయండి. ఇది జుట్టు డల్నెస్, డ్రైనెస్ ను తొలగిస్తుంది. ఇది జుట్టు చిట్లడాన్ని కూడా నివారిస్తుంది.
  2. నువ్వుల నూనె: నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మీరు జుట్టు కోసం నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  3. కొబ్బరి నూనె: చలికాలంలో కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి.. దానితో తలకు మసాజ్ చేయండి. ఇది చుండ్రు, పొడిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టుకు లోతైన పోషణను అందించడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్, అరటిపండు, అవకాడో కలపి.. మెత్తగా తయారు చేయండి. అనంతరం ఈ హెయిర్ మాస్క్‌ను 15 నిమిషాల పాటు తలకు, జుట్టుకు పట్టించాలి. దీని తర్వాత జుట్టు శుభ్రం చేసుకోవాలి.
  4. బాదం నూనె: బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కాల్ప్ డ్రైనెస్ తొలగించడంలో సహాయపడుతుంది. ఇంకా దురద సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా ఉంచడానికి, జుట్టుకు లోతైన పోషణను అందించడానికి సహాయపడుతుంది. మీరు బాదం నూనెను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో అవకాడోను గుజ్జును తీసుకోవాలి. అందులో బాదం నూనె, పెరుగు, తేనె, గుడ్డు కలపాలి. దీన్ని జుట్టు, తలకు పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచి.. జుట్టును శుభ్రం చేసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..