GOA Tour: గోవా వెళ్లొద్దామా.? తక్కువ బడ్జెట్‌లో తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ..

|

Jul 20, 2024 | 3:05 PM

గోవాకు వెళ్లాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువతకు గోవా ఒక డ్రిమ్‌. అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే చారిత్రత్మక కట్టడాలతో రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటుంది గోవా. అయితే తొలిసారి గోవా వెళ్లేవారికి ఎక్కడ స్టే చేయాలి.? ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుంది.? ఏయే ప్రాంతాలు సందర్శించాలి.? లాంటి సందేహాలు ఉంటాయి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం...

GOA Tour: గోవా వెళ్లొద్దామా.? తక్కువ బడ్జెట్‌లో తెలంగాణ టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ..
Goa Tour
Follow us on

గోవాకు వెళ్లాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువతకు గోవా ఒక డ్రిమ్‌. అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే చారిత్రత్మక కట్టడాలతో రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటుంది గోవా. అయితే తొలిసారి గోవా వెళ్లేవారికి ఎక్కడ స్టే చేయాలి.? ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుంది.? ఏయే ప్రాంతాలు సందర్శించాలి.? లాంటి సందేహాలు ఉంటాయి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి గోవాకు ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. గోవా ప్యాకేజ్‌ టూర్‌- ఇటెనరరీ పేరుతో ట్రిప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూర్‌ ఇలా సాగుతుంది..

* తొలిరోజు బషీర్‌బాగ్‌ నుంచి మధ్యాహ్నాం 2 గంటలకు గోవాకు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత మరుసటి రోజు గోవాకు చేరుకుంటారు.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కలంగుట్ చేరుకొని, హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం ఫ్రెష్‌ అప్‌ అయిన తర్వాత నార్త్‌ గోవాలోని మపుసా సిటీ, బోగ్దేశ్వర్ ఆలయం, ఫోర్ట్‌ అగుడా, బాగా బీచ్‌, కలంగుట్‌ బీచ్‌ సందర్శన ఉంటుంది. రాత్రి బస అక్కడే ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం సౌత్‌ గోవా సందర్శన ఉంటుంది. ఇక్కడ డోనా పౌలా బీచ్, మిరామార్ (గాస్పర్ డయాస్ బీచ్), ఓల్డ్ గోవా చర్చిలు, మంగేషి టెంపుల్, కోల్వా బీచ్, మార్డోల్ బీచ్‌ల సందర్శన ఉంటుంది. సాయంత్రం పాన్‌జిమ్‌లో క్రూజ్‌బోట్‌లో జర్నీ ఉంటుంది. తిరిగి రాత్రి నైట్‌ కలంగుట్‌ చేరుకుని.. అక్కడే స్టే చేస్తారు.

* నాల్గవ రోజు ఉదయం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 11 గంటలకు కలంగుట్‌ నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత ఐదవ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల విషయానికొస్తే..

ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 11,999గా నిర్ణయించారు. అలాగే పిల్లలకు రూ. 9599గా నిర్ణయించారు. సింగిల్‌ ఆక్యూపెన్సీకి మాత్రం రూ. 14,900 చెల్లించాల్సి ఉంటుంది. హోటల్‌, భోజనం ఛార్జీలు ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. పాన్‌జిమ్‌లో క్రూజ్‌ బోట్‌ జర్నీకి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతీ సోమవారం ఈ టూర్‌ ప్యాకేజీ ఆపరేట్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలు, టికెట్‌ బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..