Tulip Garden: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ క్లోజ్ చేశారు.. కారణం ఇదే..

తక్కువ వర్షం, వేడి ఉష్ణోగ్రతల కారణంగా శ్రీనగర్‌లోని ఏప్రిల్ 18, సోమవారం నాడు ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను(Tulip Garden) మూసివేయవలసి నిర్ణయించారు.

Tulip Garden: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ క్లోజ్ చేశారు.. కారణం ఇదే..
Famous Tulip Garden

Updated on: Apr 18, 2022 | 9:52 PM

తక్కువ వర్షం, వేడి ఉష్ణోగ్రతల కారణంగా శ్రీనగర్‌లోని ఏప్రిల్ 18, సోమవారం నాడు ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌ను(Tulip Garden) మూసివేయవలసి నిర్ణయించారు. ఈసారి దాదాపు 3.60 లక్షల మంది పర్యాటకులు ఇక్కడి ఉద్యానవనాన్ని సందర్శించేందుకు రావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ తోట ఇన్‌చార్జి ఇనామ్ రెహ్మాన్ సోఫీ కారణాలను వెల్లడించారు. ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ముందు ఉన్న గార్డెన్‌లో పువ్వులు కుచించుకుపోవడంతో సోమవారం మూసివేసినట్లు తెలిపారు. సుమారు 26 రోజుల తర్వాత తులిప్స్ పూయడం.. వేడి కారణంగా ఆ పువ్వులు ఎండిపోవడం వల్ల ఈ తోట మూసివేయబడింది. ఈ పూలను తాజాగా ఉంచేందుకు మేము చాలా ప్రయత్నించామని, అయితే పెరుగుతున్న వేడి కారణంగా పూలు వాడిపోకుండా ఆపలేకపోయామని సోఫీ చెప్పారు. మేం, మా ఉద్యోగులు చాలా కష్టపడ్డామని, రాత్రిపూట కూడా నీళ్లు చల్లుకునేవారని, అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టడం, అసాధారణంగా వేసవి కారణంగా పూలు త్వరగా ముడుచుకుపోతున్నాయని చెప్పారు.

తులిప్ జీవిత కాలం మూడు నుండి నాలుగు వారాలు

తులిప్ పువ్వుల సగటు జీవిత కాలం మూడు నుండి నాలుగు వారాలు, అయితే భారీ వర్షాలు లేదా విపరీతమైన వేడి వాటిని అకాలంగా నాశనం చేస్తాయని రెహమాన్ చెప్పారు. పూల పెంపకం శాఖ వారు తులిప్ పువ్వులను దశలవారీగా నాటారని, తద్వారా పువ్వులు ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తోటలో ఉంటాయి. అవి ఒకేసారి వికసిస్తాయి. అయితే ఇది ప్రయోగాత్మకంగా జరగలేదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..