IRCTC Tour: కేదార్‌నాథ్ ని దర్శించుకున్నారా.. మరి పశుపతినాథుడి దర్శనం కోసం రెడీ అవ్వడం.. టూర్ ప్యాకేజీ వివరాలు..

ఐఆర్‌సీటీసీ తెలుగు పర్యాటకుల కోసం రెండు అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ కి వెళ్లాలనుకునే వారికీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్‌లో నేపాల్‌ ని పర్యటించే విధంగా ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..

IRCTC Tour: కేదార్‌నాథ్ ని  దర్శించుకున్నారా.. మరి పశుపతినాథుడి దర్శనం కోసం రెడీ అవ్వడం.. టూర్ ప్యాకేజీ వివరాలు..
Nepal Tour

Updated on: Aug 25, 2025 | 11:34 AM

ఐఆర్‌సీటీసీ తెలుగు పర్యాటకుల కోసం రెండు అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. నేపాల్ కి వెళ్లాలనుకునే వారికీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్‌లో నేపాల్‌ ని పర్యటించే విధంగా ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు మీ కోసం..

హైదరబాద్ నుంచి నేపాల్ టూర్‌ సెప్టెంబర్‌ 12న ప్రారంభం అవుతుంది. 6 రాత్రులు.. 7 పగళ్ళుగా ఈ టూర్ సాగుతుంది. నేపాల్ లోని లుంబిని, పోఖరా, కాట్మండు, జనక్ పూరి వంటి ప్రాంతాలను వీక్షించవచ్చు. మొత్తం 30 మంది ఈ టూర్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రారంభ టికెట్ ధర రూ.43,330.

ఫస్ట్ డే: హైదరబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది. విమానం ఉదయం 11.10 స్టార్ట్ అయి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కి వెళ్తారు. అక్కడి నుంచి వాహనంలో ప్రయాణిస్తూ నేపాల్‌కి పయనం అవుతారు. లుంబినికి చేరుకొని రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సెకండ్ డే : రెండో రోజు ఉదయం లుంబిని నుంచి పోఖరాకు వెళ్తారు. అక్కడ పగోడా, మాయ దేవి ఆలయన్ని సందర్శిస్తారు. ఈ రోజు రాత్రి పోఖరాలోనే బస చేస్తారు.

మూడో రోజు: మూడో రోజు ఉదయం పోఖరాలోని సారంగ్‌కోట్‌ సన్‌రైజ్‌ వ్యూ పాయింట్‌, బింద్యాబాసిని మందిరం, దేవీ ఫాల్స్‌, గుప్తేశ్వర మహదేవ గుహాలు చుస్తాసారు. ఫేవా సరస్సులో బోటింగ్‌ కూడా చేయవచ్చు. ఈ రోజు రాత్రి కూడా పోఖరాలోనే బస చేస్తారు.

ఫోర్త్ డే: నాలుగో రోజు ఉదయం కాట్మండుకి బయలు దేరతారు. మార్గమధ్యంలో మనోఖన్మ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం కాట్మండులో స్థానిక ప్రదేశాలను చూడవచ్చు. షాపింగ్‌ చేసుకోవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఐదో రోజు: ఐదో రోజు ఉదయం స్థానిక ప్రదేశాలను సందర్శించవచ్చు. పశుపతినాథ ఆలయం, స్వయంభునాథ దేవాలయం ,దర్బార్‌ స్క్వేర్‌, రాయల్‌ ప్యాలెస్‌ వంటి ప్రదేశాలను చూడాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఆరో రోజు: ఆరో రోజు ఉదయం హోటల్‌ నుంచి నేరుగా సీతా దేవి పుట్టిన ఊరు జనక్‌పుర్‌కి పయనం అవుతారు. అక్కడ హోటల్‌లో దిగి ఫ్రెషప్‌ అయ్యాక జానకి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు.

ఏడో రోజు: ఈ ఉదయం జానక పూరి నుంచి దర్భంగా ఎయిర్‌పోర్టుకు పయనం అవుతారు. ఇక్కడ నుంచి విమానం ద్వారా నేరుగా హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.

ప్యాకేజీ టికెట్స్ ధరల వివరాలు..

సింగిల్ – షేరింగ్​ రూ. 61400
డబుల్ ఆక్యుపెన్సీ – రూ. 48,330
ట్రిపుల్ షేరింగ్‌- రూ.43,630 చెల్లించాలి.
ఇక 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్‌ అయితే రూ.38,200, విత్ అవుట్ బెడ్ అయితే 22260 చెల్లించాలి ఉంటుంది.

నేపాల్‌కు ప్రయాణించే భారతీయ పౌరుడికి ప్రవేశించిన తేదీ నుంచి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్‌పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటరు ఐడి తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..