IRCTC Tour: తెలుగువారికి IRCTC సూపర్​ ఆఫర్.. కార్తీక మాసంలో ద్వారక, సోమనాథ్ సహా ప్రముఖ క్షేత్రాల సందర్శనం..

గుజరాత్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే తమ బడ్జెట్ కు అణుగుణంగా టూర్ ఉండాలని భావిస్తారు. అటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. కార్తీక మాసంలో శివ కేశవుల ప్రముఖ క్షేత్రాలైన ద్వారక, సోమనాథ్ ల సహా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను తక్కువ ధరకే సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఏమిటంటే..

IRCTC Tour: తెలుగువారికి IRCTC సూపర్​ ఆఫర్.. కార్తీక మాసంలో ద్వారక, సోమనాథ్ సహా ప్రముఖ క్షేత్రాల సందర్శనం..
Bhavya Gujarat Package Tour

Updated on: Oct 07, 2025 | 1:48 PM

కార్తీక మాసం వచ్చేస్తుంది. ఈ నెల రోజులూ తెలుగువారు శివుడిని, శ్రీ మహా విష్ణువుని విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మాసంలో శైవ క్షేత్రాల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం IRCTC భవ్య గుజరాత్ పేరుతో ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు కోరుకుంటున్నారు. 9 రాత్రులు, 10 రోజులు పాటు భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక ట్రైన్ ఓ సాగనున్న ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఏమిటంటే..

భవ్య గుజరాత్ టూర్ అంద్ర్రప్రదేశ్ లోని రేణిగుంట నుంచి మొదలై.. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్ , పూర్ణా జంక్షన్ మీదుగా ప్రయాణించి మూడో రోజు రాత్రికి ద్వారకా చేరుకుంటారు. ఆ రోజు రాత్రికి అక్కడే హోటల్​లో స్టే చేయాల్సి ఉంటుంది.

2025 అక్టోబర్ 26 న మధ్యాహ్నం 03:00 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి మొదలై… నిర్ణీత రైల్వే స్టేషన్స్ లో అడుగుతూ… రెండో రోజు 2025 అక్టోబర్ 27 ఉదయం 08:00 గంటలకు భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక ట్రైన్ సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఇక్కడ నుంచి ఇదే రోజు ఉదయం 11:30 గంటలకు నిజామాబాద్ కు చేరుకుంది. తర్వాత , మధ్యాహ్నం 02:00 గంటలకు నాందేడ్ కు , పూర్ణా జంక్షన్ మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ టూర్ లో గమ్యస్థానాలు, సందర్శనీయ ప్రదేశాలు:

ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకా లతో పాటు సోమనాథ్ లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్ లోని గాంధీ సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం. రాణి కి బావ్. ఎకతా నగర్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించ వచ్చు.

ఈ టూర్ ప్యాకేజ్ ధరలు:

స్లీపర్ క్లాస్ టికెట్ ఒక్కరికి (SL): రూ. 18,400

స్టాండర్డ్ థర్డ్ ఏసీ : రూ 30,200

కంఫర్ట్ సెకండ్ ఏపీ (2AC) : రూ. 39,900

ఈ టూర్ ప్యాకీజేలో కల్పించే సౌకర్యాలు

రోజులో మూడు భోజనాలు .. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, వసతి, సందర్శన ప్రాంతాల్లో రవాణా సదుపాయం.. ఈ టూర్ లో పర్యాటకులున్న ప్రతి బోగీలో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. భవ్య గుజరాత్ టూర్ కోసం మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే www.irctctourism.comవెబ్ సైట్ ను సందర్శించవచ్చు. లేదా నేరుగా 9701360701, 9281030749, 9281030750, 9281495843 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..