శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శించుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు అయ్యప్పస్వామి భక్తులు. అలాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి ఛాన్స్ తీసుకొచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా శబరిమల యాత్ర పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం విడుదల చేశారు. ఇంతకీ ప్రయాణం ఎలా సాగుతుంది.? ఛార్జీలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..
* నవంబర్ 16వ తేదీన ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. రాత్రంగా ప్రయాణం ఉంటుంది.
* రెండోరోజు ఉదయం 7 గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణం ఉంటుంది. రాత్ర బస అక్కడే ఉంటుంది.
* ఇక మూడో రోజు దర్శనం, అభిషేకంలో పాల్గొంటారు. అనంతరం మధ్యహ్నం 1 గంటకల్లా నీలక్కళ్‌నుంచి చోటానిక్కర/ఎర్నాకుళం చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
* 4వ రోజు ఉదయం 7గంటలకు చోటానిక్కర అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నంగా 12 గంటలకు రైలు బయలుదేరి అదే రోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ఛార్జీల విషయానికొస్తే.. ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్ ధర రూ.11,475గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 10,655గా నిర్ణయించారు. అదే స్టాండర్డ్ (3AC)కేటగిరీ విషయానికొస్తే రూ. 18,790గా, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,700గా నిర్ణయించారు. కంఫర్ట్ (2AC) ప్యాకేజీ ధర రూ.24,215 కాగా 5 నుంచ 11 ఏళ్ల చిన్నారులకు రూ. 22,910గా నిర్ణయించారు. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకేజీలో కవర్ అవుతుంది. అయితే ఎంట్రీ ఫీజులు ప్యాకేజీలో కవర్ అవ్వవు.
మరిన్న టూరిజ వార్తల కోసం క్లిక్ చేయండి..