కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్క హిందువు కోరుకుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తిరుమలను దర్శించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి వెంకన్నను దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే కోట్లాది మంది తరలివచ్చే తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం అంతల సులభమైన విషయం కాదని తెలిసిందే.
తిరుమల దర్శన భాగ్యం కలగాలంటే కనీసం నెల రోజుల ముందే దర్శనం, రైలు, రూమ్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదేది లేకుండా అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లొచ్చే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! ఇలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఒక మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. గోవిందమ్ ప్యాకేజీ పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ఛార్జీలు ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* తొలి రోజు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి 12734 నెంబర్ ట్రైన్ బయలు దేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటారు.
* అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి హోటల్‌కి వెళ్తారు. అక్కడ ఫ్రెషన్ అయిన తర్వాత టిఫిన్ చేసి దర్శనంకు వెళ్లాల్సి ఉంఉటంది. ఉదయం 9 గంటల తర్వాత దర్శనం పూర్తవుతుంది. అనంతరం మద్యాహ్నం తిరుమలలోనే లంచ్ ఉంటుంది.
* తర్వాత తిరిగి తిరుపతి చేరుకొని అక్కడ పద్మావతి అమ్మవారి దర్శనం, అలివేలు మంగమ్మ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ఉన్న ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది.
* మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి జూలై 10వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే స్లీపర్ టికెట్స్ రూ.3800, ఏసీ టికెట్ ధరలు 5660 నుంచి ప్రారంభం కానున్నాయి. మరిన్ని పూర్తి వివరాల కోసం IRCTC టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించండి. ట్రైన్ టికెట్స్‌తో పాటు హోటల్, దర్శనం టికెట్లు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఇక అనివార్య కారణాల వల్ల టూర్ క్యాన్సెల్ చేసుకోవాల్సి వస్తే 15 రోజుల ముందు అయితే రూ.250 వరకు డిడక్షన్ ఉంటుంది. అదే 8-14 రోజుల ముందు అయితే 25 శాతం వరకు, 4-7రోజుల ముందు అయితే 50 శాతం వరకు రీఫండ్ లభిస్తుంది. నాలుగు రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రీఫండ్ లభించదు.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..