తమిళనాడులో ఆధ్యాత్మిక వారసత్వానికి నెలవు. ఇక్కడ అనేక పురాతన ఆలయాలు, మహా మనిత్వ క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,, వైష్ణవ శైవ క్షేత్రాలను దర్శించాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. వేసవి సెలవు నేపధ్యంలో ఐఆర్ సీటిసీ ఏర్పాటు చేసిన స్పెషల్ టూర్లు భారీ స్పందనను దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను ప్రకటించింది. 9 రోజుల పాటు సాగనున్న “జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర” గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పర్యటన రైలు ప్రయాణం ద్వారా చేయాల్సి ఉంటంది. ఈ టూర్ 22వ తేదీ జూన్ 2024న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. తమిళనాడులోని ప్రముఖ క్షేత్రాలైన తిరువణ్ణామలై (అరుణాచలం), జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చిమ, తంజావూరు వంటి ఆధ్యాత్మికత దివ్య క్షేత్రాలను సందర్శించే వీలు కల్పిస్తోంది. ఈ టూర్ తెలంగాణాలోని సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ ల మీదుగా సాగుతుంది. ఆయా స్టేషన్లలో ప్రయాణీకులు ఎక్కే.. దిగే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర మొత్తం 8 రాత్రులు… 9 రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణీకులకు అన్ని ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తోంది. రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, ఉదయం టీ, అల్పాహారం, లంచ్ , డిన్నర్ లను అందించనుంది. అంతేకాదు పర్యాటకుల భద్రతలో భాగంగా రైలులో అన్ని కోచ్‌లలో సిసిటీవి కెమెరాలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సౌకర్యం, ప్రయాణ భీమా సౌకర్యాలను కూడా అందించనుంది. ఈ ప్రయాణం చేసే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వృత్తిపరమైన, స్నేహపూర్వక ఐఆర్ సీటిసీ టూర్ మేనేజర్‌ల సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర ప్రారంభం తేదీ 22.06.2024.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 12:00 గంటలకు
యాత్ర ముగింపు తేదీ 30.06.2024 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
ఎన్ని రోజులు సాగనున్నదంటే 8 రాత్రులు.. 9 రోజులు
ప్యాకేజీలో టికెట్స్ ధరలు
స్లీపర్ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ . 14250
థర్డ్ ఏసీ టికెట్ ధర ఒక్కొక్కరికి రూ . 21900
సెకండ్ ఏసీ ఒక్కొక్కరికి రూ . 28450
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..