ట్రాఫిక్ లేని, ఖరీదు కాని ప్రశాంతమైన ట్రావెల్ చేయాలంటే…ఈ టూర్ ప్లాన్ మీకోసమే..

చలి, ట్రాఫిక్ జామ్ లు, ఖరీదైన హోటళ్లతో విసిగిపోయారా? కాబట్టి, ఈసారి మీ టూర్‌లో ఈ నాలుగు ప్రదేశాలను ఎంచుకోండి. అవి మీ మనసుకు, హృదయానికి ప్రశాంతతను కలిగిస్తాయి. అవును.. అది కూడా మన దేశంలోనే... మంచు వర్షాలు, చలి తీవ్రత ఎక్కువగా లేని అనేక అందమైన ప్రదేశాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. అవి మీకు ఖచ్చితంగా మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. మీరు మీ బిజీ లైఫ్‌స్టైల్‌ నుండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, ఈ ప్రదేశాలు మీకు సరైనవి. పూర్తి వివరాల్లోకి వెళితే...

ట్రాఫిక్ లేని, ఖరీదు కాని ప్రశాంతమైన ట్రావెల్ చేయాలంటే…ఈ టూర్ ప్లాన్ మీకోసమే..
Escape The Winter Blues

Updated on: Jan 29, 2026 | 3:55 PM

శీతాకాలంలో ప్రయాణించాలనే ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది మనసు మంచు పర్వతాల వైపు మళ్ళుతుంది. సోషల్ మీడియాలో మంచు, హిమపాతం, తెల్లటి అద్భుతమైన మేఘాలు కమ్మేసిన ప్రాంతాలు చూసినప్పుడు, అక్కడ హాయిగా, ప్రశాంతంగా ఉండొచ్చునని అందరూ అనుకుంటారు. కానీ, అలాంటి మంచు ప్రదేశాల్లోనూ జనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌లు, ఖరీదైన హోటళ్ళు, వణుకు పుట్టిస్తాయి. అందుకే, ఇప్పుడు చాలా మంది మంచు లేకపోతే ఏంటి..? ప్రశాంత ఉంటే చాలు..అని ఆలోచిస్తున్నారు. మనశ్శాంతి అనేది మంచులో లేదు, హడావిడి లేని ప్రదేశంలో లభిస్తుంది. భారతదేశంలో మంచు, శీతలం కానీ, అనేక అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అవి మీకు ఖచ్చితంగా ఆహ్లాదాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. మీరు హడావిడి నుండి దూరంగా విశ్రాంతి కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి…

ఈ 4 ప్రదేశాలలో మీరు మంచుకు దూరంగా ప్రశాంతతను పొందుతారు –

1. కొడైకెనాల్ – మంచు లేకుండా చల్లదనం:

ఇవి కూడా చదవండి

తమిళనాడులోని కొడైకెనాల్ తేలికపాటి శీతాకాలాలు, పచ్చదనం, ప్రశాంతతను కోరుకునే వారికి అనువైనది. ఇక్కడ అందమైన సరస్సులు, పొగమంచు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. జనసమూహాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. మార్నింగ్‌ వాకింగ్‌ సాయంత్రం స్వయంగా కాఫీ తయారీ మీకు ఓ చికిత్సలాగా అనిపిస్తుంది.

2. వయనాడ్ – పచ్చదనంలో దాగి ఉన్న శాంతి:

కేరళలోని వయనాడ్ ప్రకృతిలో మునిగిపోవాలనుకునే ప్రయాణికులకు అనువైనది. కాఫీ తోటలు, జలపాతాలు, చిన్న గ్రామాలు దీనిని ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా, ప్రశాంతంగా గడిపేందుకు అనువైన ప్రదేశం.

3. ఉదయపూర్ – శాంతి, రాజ భావన:

మీరు పర్వతాలను కోరుకోకపోయినా ప్రశాంతతను కోరుకుంటే, ఉదయపూర్ ఒక గొప్ప ఎంపిక. సరస్సుల దగ్గర కూర్చోవడం, తేలికపాటి చలి, చారిత్రక వాతావరణం మీకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి.

4. పాండిచ్చేరి – సముద్రం ఒడ్డున విశ్రాంతి తీసుకోవడం:

సముద్రపు శబ్దంలో ప్రశాంతతను కోరుకునే వారికి పాండిచ్చేరి అనువైన ప్రదేశం. ఇక్కడ రణగోణ ధ్వనులు, హడావిడి ఉండదు. సైక్లింగ్, కేఫ్‌లలో కూర్చోవడం, విశ్రాంతి సమయాన్ని ఆస్వాదించడం ఈ ప్రదేశం ముఖ్య లక్షణాలు.

ప్రతి ప్రయాణం సాహసయాత్రగా ఉండకూడదు. కొన్నిసార్లు ప్రయాణం మనసు, శరీరానికి విరామం ఇవ్వడం, ఊపిరి పీల్చుకోవడం, మీ కోసం సమయం కేటాయించడం కోసం కూడా ఎంచుకోవాలి.. ఈసారి మీరు ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే, మంచుకు దూరంగా ఉన్న ఈ ప్రదేశాలను ఎంచుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..