రాములోరి కళ్యాణం చూసేందుకు భద్రాద్రి వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ ఖర్చుతో ఇలా ప్లాన్ చేసుకోండి..

|

Apr 12, 2024 | 12:30 PM

సీతారాముల కల్యాణ వేడుకలను కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలులో వెళ్లే అవకాశం ఉంది. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే భద్రాద్రి రామయ్యను దర్శించుకోవచ్చు. నేరుగా భద్రాచలానికి రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకపోయినా సమీప స్టేషన్ లో దిగి భద్రాచలం సులభంగా చేరుకోవచ్చు. అందుకు ఏ ఏ రైళ్లలో ప్రయాణించవచ్చు అంటే..

రాములోరి కళ్యాణం చూసేందుకు భద్రాద్రి వెళ్లాలనుకుంటున్నారా.. తక్కువ ఖర్చుతో ఇలా ప్లాన్ చేసుకోండి..
Bhadrachalam Temple Tour
Follow us on

ఢిల్లీ నుంచి గల్లీ వరకూ హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీ రామ నవమి ఒకటి. రామాలయాల్లో మాత్రమే కాదు వీధుల్లో కూడా పందిరి వేసి సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజున మానవుడిగా పుట్టి నడకతో నడతతో దేవుడిగా పూజలను అందుకుంటున్న రామ నామ స్మరణతో దేశం మారు మురుగుతుంది. ఇక తెలుగువారి అయోధ్య భద్రాచలంలో రాములోరి కళ్యాణం చూడడనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో భద్రాచలం చేరుకుంటారు. ఈ నెల 17వ తేదీన సీతారాముల కళ్యాణం, 18వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం భద్రాచలంలో ఘనంగా జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేటున్నారు.

రాములోరి కల్యాణ వేడుకలను కన్నులారా వీక్షించడానికి భారీ సంఖ్యలో భద్రాచలం తరలి వెళ్ళడానికి భక్తులు రెడీ అవుతున్న వేళ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీరామనవమి పండగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో తిరు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. సీతారాముల కల్యాణ వేడుకలను కనులారా వీక్షించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలులో వెళ్లే అవకాశం ఉంది. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే భద్రాద్రి రామయ్యను దర్శించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నేరుగా భద్రాచలానికి రైళ్లలో ప్రయాణించే అవకాశం లేకపోయినా సమీప స్టేషన్ లో దిగి భద్రాచలం సులభంగా చేరుకోవచ్చు. అందుకు ఏ ఏ రైళ్లలో ప్రయాణించవచ్చు అంటే.. సికింద్రాబాద్ నుంచి బయలు దేరే మణుగూరు,  ఇంటర్ సిటీ, బీదర్, క్రిష్ణ ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ, శాతవాహన ఎక్స్ప్రెస్, చార్మినార్, గౌతమి ఎక్స్ప్రెస్, గోల్కోండ సహా పలు రైళ్లలో ప్రయాణించి భద్రాచలం చేరుకోవచ్చు.

అయితే నేరుగా భద్రాచలం వెళ్లే రైలు సదుపాయం లేదు కనుక మణుగూరు ట్రైన్ అయితే కొత్తగూడెంలో దిగి అక్కడ నుంచి భద్రాచలం బస్సు ద్వారా చేరుకోవాలి. అదే మిగిలిన రైళ్లు ఐతే డోర్నకల్ దగ్గర దిగి అక్కడ నుంచి బస్సు ద్వారా నేరుగా భద్రాచలం చేరుకోవచ్చు. ఇలా ట్రైన్ జర్నీ చేస్తే టికెట్ చార్జీలు కేవలం రూ. 200 మాత్రమే అవుతాయి. అతి తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ రాములోరి కల్యాణానికి చేరుకోవచ్చు.

మరోవైపు శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని, రద్దీని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, తాగు నీటి సౌకర్యం, వసతి సదుపాయాలు  వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల తలంబ్రాల పంపిణీ, ప్రసాదాల విక్రయం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..