
ఇలాంటి పరిస్థితుల్లో దెబ్బతిన్న బంధాలను తిరిగి చిగురింపజేయడానికి, ఉన్న ప్రేమను రెట్టింపు చేయడానికి సోషల్ మీడియాలో ఒక కొత్త ఫార్ములా వైరల్ అవుతోంది. అదే ‘777 రిలేషన్‌షిప్ రూల్’. అసలు ఈ రూల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది నిజంగానే విడిపోయే జంటలను కలుపుతుందా?
ప్రేమించడం సులభమే కానీ, ఆ ప్రేమను కాలంతో పాటు కాపాడుకోవడం చాలా కష్టం. బ్రిటీష్ నటి అమీ నుట్టాల్ తన భర్తతో ఉన్న విభేదాలను తొలగించుకుని, విడిపోయే స్థితి నుండి తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ఫార్ములానే వాడిందట. అప్పటి నుండి ఇంటర్నెట్‌లో దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. సైకాలజీ డిగ్రీలు లేదా లోతైన పరిశోధనలు అవసరం లేకుండా, కేవలం ఒక క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్ ద్వారా మీ భాగస్వామితో మళ్లీ మొదటి రోజుల్లాంటి ప్రేమను పొందవచ్చు. ఆ ‘777 రూల్’ లెక్కలేంటో చూద్దాం.
ఈ రూల్ ప్రకారం జంటలు మూడు స్థాయిలలో సమయాన్ని కేటాయించుకోవాలి.
జీవితంలో గందరగోళం పెరిగినప్పుడు ఒకరినొకరు పట్టించుకోవడం మర్చిపోతుంటాం. ఈ ‘777 రూల్’ ఒక అలారంలా పనిచేస్తుంది. భాగస్వామి మాటలను శ్రద్ధగా వినడం, కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది ఖరీదైన ప్లాన్ కానక్కర్లేదు, మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. కేవలం ఉనికి అనేది ఇక్కడ ముఖ్యం.
777 రూల్ అనేది ఏదో మాయా మంత్రం కాదు. కానీ, మారుతున్న కాలంలో మనకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తు చేసే ఒక మంచి పద్ధతి. బంధంలో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఖరీదైన గిఫ్టులు అక్కర్లేదు, కాస్త సమయం కేటాయిస్తే చాలు.