
దాల్చినచెక్క రుచి, వాసనకే కాకుండా అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది. సరైన మోతాదులో వాడటం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి.మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అలాంటి వాటిల్లో దాల్చిన చెక్క ఒకటి.. మన వంటకాలలో గుమగుమలను పెంచే దాల్చినచెక్క, కేవలం రుచి, వాసనకే పరిమితం కాదు. ఈ సుగంధ ద్రవ్యం ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ను కలిగి ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు. దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ప్రీబయోటిక్స్, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించే లక్షణాలు ఉన్నాయి.. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడుతాయి.. . చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది. సరైన మోతాదులో వాడటం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు..
ఈ రోజుల్లో అధిక సంఖ్యలో ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి, దాల్చినచెక్క ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు.. దాల్చినచెక్క పొడిని స్వీట్స్‌లో, వంటలలో వాడటం లేదా చిన్న ముక్కను చప్పరించడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
మెదడు ఆరోగ్యం – జ్ఞాపకశక్తికి దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చినచెక్కలో ఉండే సిలోన్ సినమాల్డిహైడ్ అనే రసాయనం మెదడులో విడుదలయ్యే టావు అనే హానికరమైన ప్రోటీన్‌ను తగ్గిస్తుంది. ఈ టావు ప్రోటీన్ మెదడు కణజాలంలో ఇన్ఫ్లమేషన్ కలిగించి, కణాలను దెబ్బతీసి, మరణానికి దారితీస్తుంది. దీనివల్లే అల్జీమర్స్, డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. అయితే.. దాల్చిన చెక్క జ్ఞాపకశక్తిని మెరుగుపరచి, వృద్ధులలో కూడా మతిమరుపు రాకుండా చూస్తుంది.
దాల్చినచెక్కలో ఉండే సినమాల్డిహైడ్, సినమిక్ యాసిడ్ వంటి కెమికల్స్ హైపర్ యాక్టివ్‌గా ఉండే రోగనిరోధక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువచ్చి, క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడంలో తోడ్పడతాయి. ఈ రసాయనాలు క్యాన్సర్ కణాలను వాటంతట అవే చనిపోయేలా (ఎపిప్టోసిస్) ప్రేరేపిస్తాయని 2014లో యూనివర్సిటీ ఆఫ్ వియన్నా, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించారు. దీనివల్ల క్యాన్సర్ కణాల విభజన తగ్గి, వాటి సంఖ్య అదుపులోకి వస్తుంది.
దాల్చినచెక్కలోని ఈ రసాయనాలు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి రక్తనాళాలను మృదువుగా చేసి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి.
దాల్చినచెక్కలో ఉండే 4-హైడ్రాక్సీ సినమాల్డిహైడ్, సినమిక్ యాసిడ్ యాంటీ ఫంగల్ – యాంటీ వైరల్ ఏజెంట్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి శరీరంలో ఫంగల్ , వైరల్ దాడుల నుండి రక్షణ కల్పిస్తాయి.
అయితే, దాల్చిన చెక్కను అధిక మోతాదులో వాడితే ఘాటు ఎక్కువై అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి, ఈ అద్భుత సుగంధ ద్రవ్యాన్ని సరైన పద్ధతిలో, జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి..