ఫ్రిజ్‌లో ఇవి పెడితే.. విషంగా మారతాయి.. అవేంటంటే?

| Edited By:

Nov 24, 2019 | 6:21 AM

మిగతా కాలాలతో పోలిస్తే.. ఎండాకాలంలో ఉండే అధిక వేడి తీవ్రత వల్ల ఆహార పదార్ధాలు త్వరగా పాడైపోతుంటాయి. ఇందువల్ల వీలైనంత వరకు కూరగాయలను, తినే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. ఒక్క ఇవే కాదు.. మనం వండిన వంటలను సైతం పాడైపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుండటం ఆనవాయితీగా మారింది. అయితే ఇలా ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? ఇక ఫ్రిజ్‌లో ఏయే పదార్ధాలను ఉంచాలి.. ఎలాంటి వాటిని ఉంచకూడదు.? […]

ఫ్రిజ్‌లో ఇవి పెడితే.. విషంగా మారతాయి.. అవేంటంటే?
Follow us on

మిగతా కాలాలతో పోలిస్తే.. ఎండాకాలంలో ఉండే అధిక వేడి తీవ్రత వల్ల ఆహార పదార్ధాలు త్వరగా పాడైపోతుంటాయి. ఇందువల్ల వీలైనంత వరకు కూరగాయలను, తినే ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంటాం. ఒక్క ఇవే కాదు.. మనం వండిన వంటలను సైతం పాడైపోకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుండటం ఆనవాయితీగా మారింది. అయితే ఇలా ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? ఇక ఫ్రిజ్‌లో ఏయే పదార్ధాలను ఉంచాలి.. ఎలాంటి వాటిని ఉంచకూడదు.? ఒకవేళ ఉంచితే వాటితో వచ్చే నష్టాలేంటి అన్న ప్రశ్నలకు న్యూట్రిషనిస్టులు సమాధానాలు ఇచ్చారు.

1.బంగాళదుంప:

బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు.. వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టి పడిపోతుంది. దీని వల్ల వాటిని ముక్కలుగా తరిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా లోపల ఉండే పిండి పదార్ధం తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వీటితో చేసే పదార్ధాలన్నీ చప్పగా, రుచి పచి లేకుండా ఉండటమే కాకుండా ఉడికించడానికి, వేయించడానికి చాలా సమయం తీసుకుంటాయి.

2.టమాటా:

టమాటాలను ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే.. వాటి మీద ఉండే పలచటి పొర ముడతలు పడిపోయి.. అందులోని విటమిన్ సీ తగ్గిపోయే ప్రమాదం ఉంది.  దానితో టమాటాలతో చేసే అన్ని ఆహార పదార్ధాల రుచులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి టమాటాలను ఫ్రిజ్‌లో కాకుండా గదిలో నిల్వ ఉంచాలని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.

3.ఉల్లిపాయలు:

టమాటాల మాదిరిగానే ఉల్లిపాయలను కూడా ఫ్రిజ్‌కు దూరంగా ఉంచాలి. ఎందుకంటే వాటిలోని అధిక నీటి శాతం ఫ్రిజ్ చల్లదనానికి ఐస్‌లా మారి పొరలను బాగా దగ్గరకు చేరుస్తుంది. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం బాగా కష్టమవుతుంది. ఇలానే వెల్లులిపాయలను కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు.

4.చిల్లీ హాట్ సాస్:

చిల్లీ హాట్ సాస్ బాటిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ బాటిల్స్‌ను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్నా.. సాస్ నిల్వ ఉంచడానికి వాడిన ప్రిజర్వేటివ్‌లో రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది.

5.పుచ్చకాయ:

పుచ్చకాయలను గానీ.. కోసిన ముక్కలను గానీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లన్నీ తగ్గిపోతాయి. ఇందువల్ల తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ.. టేస్ట్ మారి చప్పగా తయారవుతుంది.

6.మునగకాడ:

మునక్కాడలను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచకండి. ఒకవేళ అవి ఉంచితే కొయ్య ముక్కలా తయారవడం ఖాయం. అందుకే వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయడం ఉత్తమం. ఇలాగే తేనే, బ్రెడ్ వంటి ఆహారపదార్ధాలను కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు.

ఫ్రిజ్‌లో ఉంచాల్సిన వస్తువులు…

క్రీమ్ బిస్కెట్లు, చాకోలెట్స్, కంటి, చెవి డ్రాప్స్, రకరకాల పండ్లు, ఆకు కూరలు, కొబ్బరి చిప్పలు(ఎండినవి కావు), పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి పెట్టుకోవచ్చు.