
శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా చర్మం, కళ్లు, నాలుక రంగులో కనిపించే మార్పు ఆధారంగా ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు వైద్యులు వివరిస్తారు. అనారోగ్య సమస్యతో వైద్యుడుని సంప్రదించిన వెంటనే నాలుకు చూపించమని అడిగేది అందుకే.
నాలుక రంగులో జరిగే మార్పులు మీ ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే నాలుక రంగులో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నాలుక రంగు మారడం కొన్ని రకాల వ్యాధులకు ముందస్తు సూచనగా చెబుతున్నారు. ఇంతకీ నాలుక రంగులో కనిపించే మార్పులు ఈ వ్యాధులకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
* నాలుక రంగు తెల్లగా మారితే అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. అది తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. పరిశోధన ప్రకారం, మీ నాలుక రంగు తెల్లగా మారితే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకోవాలి. నాలు తెలుపు రంగులోకి మారడం ల్యూకోప్లాకియా, నోటి లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు లక్షణాలుగా చెప్పొచ్చు.
* ఒకవేళ నాలుక ఎరుపు రంగులోకి మారితే.. ఫ్లూ, జ్వరం లేదా ఒక రకమైన ఇన్ఫెక్షన్ కారణమని అర్థం చేసుకోవాలి. అలాగే నాలుక ఎరుపు రంగులోకి మారండం విటమిన్ బీ, ఐరన్ లోపం ముందస్తు లక్షణంగా చెప్పొచ్చు.
* నాలుక నల్ల రంగులోకి మారితే చాలా ప్రమాదకరంగా భావించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం నాలుక నల్ల రంగులోకి మారితే.. క్యాన్సర్, ఫంగస్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు లక్షణంగా భావించాలి. బ్యాక్టీరియా లేదా ఫంగస్ వల్ల కూడా నాలుక రంగు మారుతుంది.
* ఒకవేళ నాలుక పసుపు రంగులోకి మారితే జీర్ణక్రియ, కాలేయ సమస్యలకు లక్షణంగా భావించాలి. అలాగే నోటిలో అధిక బ్యాక్టీరియా కారణంగా, నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది, నోటి నుండి దుర్వాసన రావడం కూడా ప్రారంభమవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..