Food: స్కూల్‌ నుంచి వచ్చిన చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఇష్టంగా తింటారు

అందులోనూ సాయంత్రం వర్షం పడుతున్న ఈ తరుణంలో చల్లటి వెదర్‌లో వేడివేడిగా ఏదైనా స్నాక్స్‌‌ అందిస్తే చిన్నారులు ఖుషీ అవుతారు. అలాంటి వారి కోసమే చిటికెలో చేసే ఒక మంచి స్నాక్‌ అందుబాటులో ఉంది. అందే మసాలా బ్రెడ్ స్నాక్స్‌. క్షణాల్లో తయారయ్యే ఈ స్నాక్స్‌ రుచి విషయంలో మాములుగా ఉండవు. ఇంతకీ మసాలా బ్రెడ్‌ స్నాక్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి.?

Food: స్కూల్‌ నుంచి వచ్చిన చిన్నారులకు ఈ స్నాక్స్‌ చేసి ఇవ్వండి.. ఇష్టంగా తింటారు
Bread Masala
Follow us

|

Updated on: Jun 18, 2024 | 7:52 AM

సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు నిరసంతో ఉంటారు. ఇలాంటి వారు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్‌ చేసివ్వమని అడుగుతుంటారు. అయితే డెయిలీ ఒకే రకమైన స్నాక్స్‌ ఇవ్వడం ద్వారా బోర్‌గా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్నాక్స్‌ను అందిస్తే భలే ఉంటుంది కదూ!

అందులోనూ సాయంత్రం వర్షం పడుతున్న ఈ తరుణంలో చల్లటి వెదర్‌లో వేడివేడిగా ఏదైనా స్నాక్స్‌‌ అందిస్తే చిన్నారులు ఖుషీ అవుతారు. అలాంటి వారి కోసమే చిటికెలో చేసే ఒక మంచి స్నాక్‌ అందుబాటులో ఉంది. అందే మసాలా బ్రెడ్ స్నాక్స్‌. క్షణాల్లో తయారయ్యే ఈ స్నాక్స్‌ రుచి విషయంలో మాములుగా ఉండవు. ఇంతకీ మసాలా బ్రెడ్‌ స్నాక్స్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్థాలు..

కట్ చేసుకున్న బ్రెడ్‌ ముక్కలు, తగినంత నూనె, ఆఫ్‌ టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్‌ స్పూన్‌, సన్నగా తరిగిన ఒక టొమాటో, పౌ టీస్పూన్‌ పసుపు పొడి, ఒక టీస్పూన్‌ కాశ్మీరీ కారం, 1 టీస్పూన్‌ గరంమసాలా, ఉప్పు తగినంత, 4 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్‌.

తయారీ విధానం..

ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి అందులో 1 టేబుల్‌ స్పూన్‌ నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అనంతరం ఒక గిన్నె తీసుకొని నూనె పోసి వేడయ్యాక జీలకర్ర వేసి తాలింపు చేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసి గోల్డెన్‌ కలర్ వచ్చే వరకు వేయించాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇక టొమాటో, పసుపు, కశ్మీరీ కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. తర్వాత అందులో టొమాటో కెచప్‌ వేసి కలుపుకోవాలి. చివరిగా ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలను వేసి బాగా తిప్పితే రుచికరమైన బ్రెడ్‌ మసాలా రడీ అయినట్లే.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..