How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

|

Jun 16, 2023 | 9:01 AM

మనం వేసిన పెరుగు ఆ పాలల్లో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను ఫాయిల్ పేపర్‌తో పూర్తిగా కప్పేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని గ్యాస్‌పై మరిగించాలి. తర్వాత అందులో స్టీల్ స్టాండ్ వేసి దానిపై పుల్లటి పెరుగు కలిపిన పాలను ఉంచాలి. మీకు 15 నిమిషాల్లోనే పెరుగు సిద్ధమవుతుంది.

How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
How To Make Curd
Follow us on

పెరుగు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు వేసవిలో తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, రాత్రిపూట పెరుగు తినటం నివారించాలంటున్నారు. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సీజన్‌లో పాల కంటే పెరుగుకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగు, మజ్జిగ, లస్సీ రూపంలో తప్పక తీసుకుంటారు. అయితే, మార్కెట్‌లో లభించే పెరుగు కల్తీ ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే పెరుగును ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అయితే, పెరుగు తయారుచేసే సాంప్రదాయ పద్ధతులు చాలా మందికి తెలుసు. కానీ, తక్కువ సమయంలో పెరుగు ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. కేవలం 15 నిమిషాల్లో పెరుగును తయారుచేసే సులువైన మార్గం ఉంది. ఈ ట్రిక్‌తో పెరుగు స్టోర్‌లో లాగానే క్రీమీగా మారుతుంది. మీకు నమ్మకం లేకుంటే మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

మీరు పెరుగును చిక్కగా, క్రీమీగా చేయాలనుకుంటే, నాణ్యమైన పాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో పెరుగు చేయడానికి ఎప్పుడూ మీగడ పాలు మాత్రమే కొనండి. అందులో నీళ్లు అస్సలు కలపకూడదు. సూపర్‌ మార్కెట్‌లో దొరికినట్టుగానే ఉండే పెరుగు తయారు చేయడానికి పాలను బాగా మరిగించండి . ఇక నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. కొన్ని ప్రత్యేక వస్తువులు కూడా అవసరం. అది అల్యూమినియం ఫాయిల్ , స్టీల్ బౌల్, దేశీ పుల్లని పెరుగు కావాలి.

తక్కువ సమయంలో పెరుగు తయారు చేయడానికి, ఒక స్టీల్ గిన్నెలో గోరువెచ్చని పాలు పోసి, దానికి 2-3 చెంచాల పెరుగును కలపాలి. ఆ తర్వాత చెంచా లేదంటే హ్యాండ్ బ్లెండర్‌తో బాగా కలపాలి. మనం వేసిన పెరుగు ఆ పాలల్లో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను ఫాయిల్ పేపర్‌తో పూర్తిగా కప్పేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని గ్యాస్‌పై మరిగించాలి. తర్వాత అందులో స్టీల్ స్టాండ్ వేసి దానిపై పుల్లటి పెరుగు కలిపిన పాలను ఉంచాలి. దానిని పై మూతపెట్టి గ్యాస్ మంటను తగ్గించండి . మీకు 15 నిమిషాల్లోనే పెరుగు సిద్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి

15 నిమిషాల్లో సెట్ అయ్యే పెరుగు చిక్కగా, క్రీమీగా ఉంటుంది. కానీ, ఇది చాలా పుల్లగా ఉండదు. అలాంటప్పుడు మీరు తీపి పెరుగును ఇష్టపడితే, మీరు వెంటనే తినెయొచ్చు.. అయితే సరిగ్గా పులుపు కావాలంటే గిన్నెలోని రేకు తీయకుండా క్యాస్రోల్‌లో ఉంచి మూత పెట్టాలి. దానిని మందపాటి టవల్‌లో చుట్టి, ఎవరూ కదిలించకుండా ఉండేలా ఓ మూలలో ఉంచండి. 2-3 గంటల తర్వాత అది చక్కటి చిక్కటి గడ్డ పెరుగుగా మారుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..