తొక్కే కదా అని తీసి పాడేస్తున్నారా? ఈ పండ్లు, కూరగాయల తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

|

Jan 28, 2023 | 9:07 PM

కాబట్టి పండ్లు, కూరగాయల తొక్కలను విసిరే ముందు, మీరు ఒకసారి ఆలోచించాలి. వీటిలో చర్మాన్ని పోషించగల అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మొటిమలు, ముడతలు మొదలైన వాటిని వీటి సహాయంతో తొలగించుకోవచ్చు.

తొక్కే కదా అని తీసి పాడేస్తున్నారా? ఈ పండ్లు, కూరగాయల తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Vegetable, Fruit Peels
Follow us on

మంచి ఆరోగ్యం కోసం మనమందరం పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటాం. ఆరోగ్యపరంగానే కాదు ఈ పండ్లు, కూరగాయలు మన చర్మానికి కూడా మేలు చేస్తాయి. కేవలం వీటితోనే కాదు వీటి తొక్కలు కూడా అందం విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లు, కూరగాయల తొక్కలు చర్మం కాంతివంతం చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే వీటి బెరడులను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. కాబట్టి పండ్లు, కూరగాయల తొక్కలను విసిరే ముందు, మీరు ఒకసారి ఆలోచించాలి. వీటిలో చర్మాన్ని పోషించగల అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మొటిమలు, ముడతలు మొదలైన వాటిని వీటి సహాయంతో తొలగించుకోవచ్చు. మీ చర్మం మిలమిలా మెరిసేలా చేయడానికి మీరు నారింజ తొక్కను ఉపయోగించవచ్చు. ఇందుకోసం కొన్ని నారింజ తొక్కలను ఎండలో ఆరబెట్టి బాగా గ్రైండ్ చేసి పౌడర్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మీ ఫేస్ ప్యాక్‌తో మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

దానిమ్మ తొక్క

దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మంపై మచ్చలు, ముడతలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. దీని కోసం దానిమ్మ తొక్కను ఎండలో ఎండబెట్టి, దాని పొడిని సిద్ధం చేయాలి. ఆ తర్వాత ఈ పొడిలో తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. దాని సహాయంతో మీరు చర్మంపై సహజమైన గ్లో పొందవచ్చు. అలాగే, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు దూరమవుతాయి. బంగాళదుంప తొక్కలు

ఇవి కూడా చదవండి

బంగాళాదుంప తొక్క

మీరు మీ ముఖానికి బంగాళాదుంప తొక్కను ఉపయోగించవచ్చు. దీని వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. ఇందుకోసం బంగాళదుంప తొక్క తీసి ఎండబెట్టి గ్రైండ్ చేసి అందులో కొంత గంధపు పొడి కలపాలి. తర్వాత అందులో కాస్త రోజ్ వాటర్, అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.

బొప్పాయి

బొప్పాయి జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది చర్మం మెరిసిపోవడానికి కూడా సహాయపడుతుంది. దీని వల్ల మీ చర్మం పొడిబారకుండా పోవచ్చు. దీనిని ఉపయోగించాలంటే బొప్పాయిని తొక్క తీసి ఎండలో ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కాస్త పెరుగు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. దీంతో చర్మం మెరుస్తుంది. ఇది చర్మం తేమను నిలుపుకోవడంలో కూడా సహాయపడుతుంది.

దోసకాయ తొక్క

దోసకాయ తొక్క చర్మానికి కూడా చాలా మంచిది. దీని కోసం మీరు దోసకాయ తొక్కలను నేరుగా ముఖంపై రుద్దవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ తొక్కలను పొడి చేసి ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి పోషణ, తేమను అందిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..