Curd Side Effects: ఈ సమస్యలున్నాయా..? అయితే పెరుగుకు దూరంగా ఉండండి.. లేకపోతే మీ ఆరోగ్యానికే హానికరం..!

కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం. కొన్ని రకాల  వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానుకోవాలి. అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి..

Curd Side Effects: ఈ సమస్యలున్నాయా..? అయితే పెరుగుకు దూరంగా ఉండండి.. లేకపోతే మీ ఆరోగ్యానికే హానికరం..!
Curd Side Effects

Updated on: Mar 30, 2023 | 2:00 PM

శరీరానికి మేలు చేసే పదార్థాలలో పెరుగుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలకు ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్, హై బీపీ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా పెరుగు ప్రయోజనకరంగా ఉంటుంది.  అయితే కొంతమందికి పెరుగు తీసుకోవడం చాలా హానికరం. కొన్ని రకాల  వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానుకోవాలి. అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకున్నా కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఏయే సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు తీసుకోవడం వలన ఎముకలు, దంతాలకు మంచిది. అయితే కీళ్లనొప్పులు ఉన్నవారికి పెరుగు హానికరం. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. ఇది నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారు పెరుగు తీసుకోకూడదు. అలాగే ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మానుకోవాలి. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. రాత్రిపూట అస్సలు తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

లాక్టోస్ అలెర్జీ ఎక్కువగా ఉన్నవారు.. పెరుగు తీసుకోకపోవడం మంచిది. అలాంటి వారికి పెరుగు తినడం వలన డయేరియా, కడుపులో నొప్పి సమస్య కలుగుతుంది.

అసిడిటీ సమస్య ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకూడదు. ముఖ్యంగా వీరు రాత్రి పూట పెరుగు అస్సలు తినవద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us