Tulsi Benefits: తులసి ఆకులతో జుట్టు, చుండ్రు సమస్యలకు చెక్.. ఎలా ఉపయోగించాలంటే..

తులసి చెట్టును లక్ష్మి దేవిగా పూజిస్తుంటాం. అంతేకాకుండా.. పలు అనారోగ్య సమస్యలను నివారించడంలో కూడా తులసి ఎంతో సహాయపడుతుంది.

Tulsi Benefits: తులసి ఆకులతో జుట్టు, చుండ్రు సమస్యలకు చెక్.. ఎలా ఉపయోగించాలంటే..
Tulsi Benefits

Updated on: Jun 14, 2021 | 5:50 PM

తులసి చెట్టును లక్ష్మి దేవిగా పూజిస్తుంటాం. అంతేకాకుండా.. పలు అనారోగ్య సమస్యలను నివారించడంలో కూడా తులసి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ చెట్టును ఆయుర్వేదంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి, కంటినొప్పి, జలుబు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తుంటారు. దీనిని రోజూ తీసుకునే టీ, కాఫీతో కలిపి తీసుకోవడం వలన శరీరం ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు అనేకం ఉన్నాయి. ఇవి బ్లాక్ హెడ్స్ తగ్గిస్తాయి. అలాగే మొటిమలను తగ్గించడమే కాకుండా.. జుట్టు సమస్యలు, చుండ్రును తగ్గించడంలో సహయపడతాయి. కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా.. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలకు కూడా తులసితో చెక్ పెడుతుంది. అయితే ఈ తులసిని రోజూ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

జుట్టు రాలడం..
తాజా తులసి ఆకులను.. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 45 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.

జుట్టు చిట్లిపోవడం..
2 టేబుల్ స్పూన్ల తులసి పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 కలబంద జెల్ కలిపి పేస్ట్ గా మార్చాలి. దానిని తలకు అప్లై చేసి 45 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు వాడితో ఫలితం కనిపిస్తుంది.

పొడి జుట్టు కోసం..
2 టేబుల్ స్పూన్ల తులసి పేస్ట్ లో 1 టేబుల్ సూప్న్ ఆలివ్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ అరటి పండు గుజ్జు కలిపి పేస్ట్ గా చేయాలి. దీనిని తల నుంచి కుదుళ్ల వరకు పట్టించి 45 నిమిషాల తర్వాత కడిగేయ్యాలి. జుట్టు పొడవును బట్టి తీసుకునే పరిమాణం మార్చడం ఉత్తమం.

డాండ్రాఫ్..
2 టేబుల్ స్పూన్ల తులసి మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ ఆమ్లా ఫౌడర్, 1/2 కొబ్బరి నూనె కలిపి పేస్ట్ గా చేయాలి. 45 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

Also Read: Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..