
శీతాకాల వాతావరణ ప్రభావంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యం చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా మనం త్వరగా అనారోగ్య సమస్యల భారీన పడుతాం. ఈ సమయంలో, కొంతమంది శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుంది.ఈ సమస్యని లైట్ తీసుకుంటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే, చిన్న గాయాలు కూడా తీవ్రంగా మారుతాయి. కాబట్టి, శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గడానికి కారణాలు ఏమిటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.
శీతాకాలంలో శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి కారణమేమిటి?
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం, చల్లని వాతావరణంలో, శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి సందర్భాలలో, శరీర రక్త వ్యవస్థ ప్రభావితమవుతుంది. దీంతో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం ప్రారంభమవుతుంది. శీతాకాలంలో, సూర్యరశ్మి లేకపోవడం, నీరు తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. కొందరిలో, దీర్ఘకాలిక వ్యాధులు లేదా మందులను నిరంతరం వాడటం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అదనంగా, పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.
తక్కువ ప్లేట్‌లెట్స్ లక్షణాలు:
మన రక్తంలో ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నప్పుడు, మీకు తరచుగా ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ళ నుండి రక్తస్రావం లేదా మీ శరీరంపై నీలం-నలుపు మచ్చలు కనిపించవచ్చు. అలాగే మీకు చిన్న గాయం తగిలినా ఎక్కువ రక్తం పోతుంది. ఇదే కాదు నిరంతరం బలహీనత, అలసటగా అనిపంచడం, తలతిరుగుతున్నట్టు అనిపించడం కూడా శరీరంలో ప్లేట్‌లేట్స్ తగ్గడానికి కారణం కావచ్చు. మహిళల్లో, ఋతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం కూడా తక్కువ ప్లేట్‌లెట్లకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే, పరిస్థితి తీవ్రంగా మారవచ్చు.
దీన్ని ఎలా నివారించాలి?
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.