
ఇండియాలో చాలా మంది కాఫీ కంటే టీ తాగడానికే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు. కొందరు రోజుకు ఒకసారి టీ తాగితే మరికొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు టీ తాగుతుంటారు. ఇక ఆఫీసుల్లో వర్క్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు రోజుకు కనీసం మూడు సార్లు తప్పక టీ తాగుతుంటారు. అయితే టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా, అతిగా తాగడం అస్సలే మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఇక టీ తాగడంలోనే కాదండోయ్, తయారు చేయడంలో కూడా కొన్ని రకాల తప్పులు అస్సలే చేయకూడదంట. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కాగా, మనం ఇప్పుడు టీ తయారు చేసే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో, వివరంగా తెలుసుకుందాం.

టీలో ఉండే కెఫిన్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. టీ తీసుకోవడం తగ్గించడం వల్ల బాగా నిద్రపడుతుంది. అది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. టీలోని చక్కెర చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఇది మొటిమలకు కూడా కారణమవుతుంది. టీ తీసుకోవడం తగ్గిస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

అదేవిధంగా కొందరు ఉదయం చేసిన టీని మళ్లీ సాయంత్రం లేదా, మధ్యాహ్నం వేడి చేసి తాగుతుంటారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు, టీనితాగే ముందు పదే పదే వేడ చేయడం వలన ఇది టీలోని ఆమ్లత్వాన్ని పంచి, జీర్ణసమస్యలను కలిగిస్తుందంట. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, వంటి అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుందంట.

ఇక కొంత మంది టీ తయారు చేసే క్రమంలోనే కొన్ని తప్పులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా పాలల్లో టీ పొడి కలిపి టీ తయారు చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు, దీని వలన అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట. అందుకే టీని పాలల్లో కలిపి తీసుకోకూడదంట.