Custard Apple: తియ్యగా ఉందని తెగ తింటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

|

Oct 20, 2024 | 8:17 AM

శీతాకాలంలో కచ్చితంగా కనిపించే పండ్లలో సీతాఫలాలు ముఖ్యమైనవి. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరిలో మాత్రం సీతాఫలాలు ఇబ్బందికి గురి చేస్తాయని అంటున్నారు. ఇంతకీ ఏయే సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి.? ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Custard Apple: తియ్యగా ఉందని తెగ తింటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Custard Apple
Follow us on

శీతాకాలం వచ్చిందంటే చాలు ఠక్కున సీతాఫలం గుర్తొస్తోంది. రుచిలో అద్భుతంగా ఉండే సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం సీతాఫలాన్ని కచ్చితంగా తీసుకోవాలని చెబుతుంటారు. అయితే అతి అనర్థానికే దారి తీస్తుందన్నట్లు సీతాఫలాలు కూడా ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

సీతాఫలంలోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం వంటి ఎన్నో ఖనిజాలు రోగ నిరోధక వక్తి పెంచడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాట్లే.. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు కూడా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు సీతాఫలాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు..

సాధారణంగా మనలో కొందరు సీజన్‌తో సంబంధం లేకుండా దగ్గు, జలుబుతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు సీతాఫలాలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా సీతాఫలాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కొందరికి సీతాఫలాలు తింటే శరీరంపై ఎర్రటి దద్దరు, దురద వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇక సీతాఫలంలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది తీవ్రమైన కడుపు నొప్పికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఫైబర్‌ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో అధికంగా తీసుకుంటే దుష్ప్రభావం పడే అవకాశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా విరోచనలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది.

నరాల సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా సీతాఫలాలను మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధితో బాధ పడుతూ మెడిసిన్‌ తీసుకునే వారు సీతాఫలాలకు దూరంగా ఉండాలి. ఇందులోని అనోనాసిన్ అనే టాక్సిన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక గర్భిణీలు సీతాఫలాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో గింజలను తెలియయకుండా తినడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే డయాబెటిస్‌తో బాధపడేవారు, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు ఈ పండుకు దూరంగా ఉండడమే బెటర్‌.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..