Lifestyle: ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

|

Sep 01, 2024 | 11:57 AM

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం బాటిల్‌పై కూడా ఈ విషయాన్ని స్పష్టంగా కనిపించేలా రాస్తారు. అయినా మందు బాబులు మాత్రం మద్యం మానడానికి ఇష్టపడరు. ఆల్కహాల్‌ వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. లివర్‌ మొదలు, గుండె పోటు వరకు పలు ఆరోగ్య సమస్యలకు మద్యపానం కారణం. కాగా మద్యం సేవించే సమయం...

Lifestyle: ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
Alcohol
Follow us on

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం బాటిల్‌పై కూడా ఈ విషయాన్ని స్పష్టంగా కనిపించేలా రాస్తారు. అయినా మందు బాబులు మాత్రం మద్యం మానడానికి ఇష్టపడరు. ఆల్కహాల్‌ వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. లివర్‌ మొదలు, గుండె పోటు వరకు పలు ఆరోగ్య సమస్యలకు మద్యపానం కారణం. కాగా మద్యం సేవించే సమయంలో రకరకాల ఫుడ్‌ తీసుకుంటుంటారు. అయితే ఈ ఫుడ్‌ తీసుకోవడంలో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యంతో పాటు నాన్‌ వెజ్‌ను తీసుకుంటే పలు సమస్యలు తప్పవని అంటారు.

ఇదే సమయంలో కొందరు మద్యంతో పాటు పండ్లను తీసుకుంటారు. పండ్ల ముక్కలను తింటూ మద్యం సేవిస్తంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే భావనలో ఉంటారు. అయితే మద్యం సేవిస్తూ పండ్లను తీసుకోవడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా, మద్యంతో కలిపి తీసుకోవడం మాత్రం మంచిది కాదని అంటున్నారు. ఇంతకీ మద్యం, పండ్లు కలిపి తీసుకుంటే ఏమవువుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కంటెంట్‌ పుష్కలంగా ఉంటాయి. నిజానికి పండ్లలోని ఫైబర్‌ కంటెంట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే మరోవైపు ఆల్కహాల్‌ జీర్ణక్రియ రేటును తగ్గిస్తుంది. ఈ రెండు విభిన్నమైన కాంబినేషన్‌ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపులో గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

* పండ్లలో సహజ చక్కెర (ఫ్రక్టోజ్‌) ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి వనరుగా పనిచేస్తుంది. అయితే అదే సమయంలో ఆల్కహాల్‌లో కూడా కేలరీలు అధికంగా ఉంటాయి. పండ్లు, ఆల్కహాల్‌ ఒకేసారి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది అస్సలు మంచికాదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలల ఉన్నపలంగా పెరుగుతాయి.

* ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల శరీరం పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది. ఈ కారణంగా పండ్లలో ఉండే పోషకాలను గ్రహించకపోగా, ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంని అంటున్నారు.

* అసలు మద్యం సేవించడమే ఆరోగ్యానికి మంచిది కాదంటే. ఇక పండ్లతో కలిపి తీసుకోవడం అసలే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌ను, పండ్లను కలిపి తీసుకోకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి…