
ఇటీవల చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం తీసుకుంటున్న, ఆహారంలో మార్పుల కారణంగా ఊబకాయంతో సతమతమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు బరువు పెరగడం ఎక్కువుతోంది. ఇలా ఉన్నపలంగా బరువు పెరగడానికి ముఖ్యంగా 5 రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మని తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగానే త్వరగా బరువు పెరుగుతున్నారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నిద్రలేమి సమస్య కూడా అధిక బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేకపోవడం హార్మోన్ల సమతుల్యతలో భంగం కలిగిస్తుంది. ఇది ఆకలి పెరగడానికి కారణమవుతుంది. దీంతో సహజంగానే మనకు తెలియకుండానే ఎక్కువగా తింటుంటాం. ఇది అధిక బరువుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ప్రస్తుతం ఒత్తిడి బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణమని చెప్పొచ్చు. ఒత్తిడి కారణంగా శరీరంలో ‘కార్టిసాల్ ‘ అనే హార్మోను స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. దీంతో ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు.
* రాత్రిపూట తీసుకునే ఆహారం కూడా బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణమవుతుంది. రాత్రి తీసుకునే ఆహారం లైట్‌గా ఉండాలి. దీనికి కారణం రాత్రి జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది.
* శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ కొంత వ్యాయామం లేదా నడవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇది కేలరీలను బర్న్ చేసి బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.
* కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణమవుతుంటాయి. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్, PCOD లేదా ఇతర హార్మోన్ల సమస్యల వంటివి కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..