రొమ్ము క్యాన్సర్ అనగానే కేవలం మహిళలకు సంబంధించినది మాత్రమే అనుకుంటాం. అయితే పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తప్పదని మీకు తెలుసా.? వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. BRCA1, BRCA2 జన్యువులలో ఉత్పరివర్తనలు ఉన్న పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్ ఉన్న పురుషులు, అధిక బరువు లేదా ఊబకాయం వంటి సమస్యలున్న వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆల్కహాల్ సేవించడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ఈ సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే ఎలా గుర్తించాలి.? ఎలాంటి చిక్సత ఉంటుంది. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రొమ్ము చుట్టూ నొప్పి, వాపు, పుండ్లు లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్‌కు ముందస్తుగా అర్థం చేసుకోవాలి. అలాగే నిపుల్స్ ఎరుపు రంగులోకి మారినా వెంటనే వైద్యులను సంప్రందిచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే చనుమొన నుంచి చీము వంటి ద్రవం బయటకు రావడం, చనుమొన లోపలికి చొచ్చుకుపోవడం వంటి లక్షణాలు కూడా క్యాన్సర్‌కు ముందుస్తు లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
సాధారణంగా వైద్యులు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని ముందుగానే గుర్తిస్తారు. BRCA అనే జన్యు పరీక్ష ఆధారంగా ముందుగానే ఈ సమస్యను గుర్తించవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయితే వైద్యులు సూచించే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..