ఇంట్లో చేసే ఈ 5 తప్పులే మీ రోగాలకు కారణం..! తెలుసుకోండి లేదంటే భారీ మూల్యం తప్పదు..

|

Sep 07, 2021 | 1:47 PM

Health Tips: పూర్వ కాలంలో ప్రజలు పోషకాలు ఉండే ఆహారాన్ని తినేవారు అంతేకాకుండా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అందుకే వారు ప్రాణాంతక వ్యాధులకు

ఇంట్లో చేసే ఈ 5 తప్పులే మీ రోగాలకు కారణం..! తెలుసుకోండి లేదంటే భారీ మూల్యం తప్పదు..
Common Habits
Follow us on

Health Tips: పూర్వ కాలంలో ప్రజలు పోషకాలు ఉండే ఆహారాన్ని తినేవారు అంతేకాకుండా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. అందుకే వారు ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండేవారు. కానీ నేటి కాలంలో శారీరక శ్రమ ఎవ్వరూ చేయడంలేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు మొబైల్స్‌కి అలవాటు పడ్డారు. ఇంట్లో తినడానికి బదులుగా బయటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతోంది. దీంతో చిన్న వయస్సులోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే కొన్ని వ్యాధులకు మాత్రం కారణం మన చెడు అలవాట్లే. చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా పదే పదే చేయడం వల్ల రోగాల భారిన పడుతున్నారు. ఈ అలవాట్ల కారణంగా బ్యాక్టీరియా చెంతన చేరి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. సకాలంలో ఈ అలవాట్లను మార్చుకోవాలి లేదంటే చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఈ రోజుల్లో మొబైల్‌, లేదా వార్తాపత్రికలను టాయిలెట్‌కు తీసుకెళ్లడం స్టేటస్ సింబల్‌గా మారింది. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్‌లు, ట్యాప్‌లలో కనిపించే బ్యాక్టీరియా మొబైల్ స్క్రీన్‌లు లేదా వార్తాపత్రికలకు అంటుకుంటుంది. తర్వాత ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.

2. చాలామంది చెప్పులు, షూస్‌తో బయట తిరిగి అలాగే ఇళ్లలోకి ప్రవేశిస్తారు. ఇది చాలా చెడ్డ అలవాటు. బూట్లు, చెప్పులతో ఇంట్లోకి రకరకాల బ్యాక్టీరియాను ఆహ్వానిస్తారు. ఇది కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణమవుతుంది.

3. కొంతమందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది మంచి అలవాటు కాదు. దీనివల్ల అతడు అనారోగ్యానికి గురవుతాడు. గోరులో ఉండే మురికి కడుపులోకి వెళుతుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు ఇతర సమస్యలను కలిగిస్తుంది.

4. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ మొబైల్‌లో మాట్లాడటానికి, పాటలు వినడానికి, వీడియోలు చూడటానికి ఇయర్‌ఫోన్‌లు అవసరం. దీనివల్ల ఒకరు వాడిన ఇయర్‌ ఫోన్‌లను మరొకరు వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకరి ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

5. డిష్‌వాషర్ స్పాంజ్ అన్ని పాత్రలను శుభ్రపరుస్తుంది కానీ మనం దానిని శుభ్రం చేయడం మర్చిపోతాం. దీని వాడకం కూడా చాలా నెలలు ఉంటుంది. అందువల్ల ఇందులో బ్యాక్టీరియా తిష్ఠ వేస్తుంది. ప్రతి నెలా స్పాంజిని మార్చాలి. ఇది కాకుండా మధ్య మధ్యలో వెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. గిన్నెలు తోమడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలి.

Vinayaka Chavithi: మట్టి విగ్రహాలను పంపిణీ చేసి కరోనా నిబంధనలు పాటిస్తూ.. వినాయక చవితి జరుపుకోవాలని కోరిన మంత్రులు

Doctor Missing: నల్గొండలో NRI డాక్టర్ అదృశ్యం.. కిడ్నాపా.. ఆత్మహత్యా.. హత్యా.. లేదంటే..

Pooja Hegde: బుట్టబొమ్మ మెయింటెన్స్‌కు ఫిదా అవుతున్న పొరగాళ్లు.. ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్న పూజ హెగ్డే ఫొటోస్..