వ్యాయామం, వాకింగ్, రన్నింగ్ మొదలైనవి శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పరిగెత్తడం మీ గుండెకు మంచిది. ఆరోగ్యంగా ఉండటానికి ఇది గొప్ప మార్గం. ఎముకలు, కండరాలను బలోపేతం చేయడం నుండి ఆరోగ్యకరమైన బరువును నిర్వహణ వరకు ఈ రన్నింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. అందుకే రోజులో కనీసం 10 నిమిషాల పాటు పరుగెత్తడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రన్నింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రన్నింగ్ లేదా జాగింగ్ ఒక గొప్ప కార్డియో వర్కవుట్‌గా చెబుతారు. ప్రతిరోజు 10 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ రన్నర్లకు గుండె సమస్యలతో మరణించే ప్రమాదం 50శాతం తక్కువగా ఉంటుంది.. రన్నింగ్ మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీ హృదయ స్పందన తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని అర్థం
మీ ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం స్వయంగా రిపేర్ అవుతుంది. కాబట్టి మీరు పని రోజంతా మంచి అనుభూతి చెందుతారు. రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మీ మెదడును చురుకుగా ఉంచుతాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి.
మీకు జ్ఞాపకశక్తి సమస్యలు ఉంటే రన్నింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రన్నింగ్ మెదడుకు అనేక దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. పెరిగిన హృదయ స్పందన రేటు, నడుస్తున్నప్పుడు చెమటలు హిప్పోకాంపస్‌లో పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటి వ్యాయామం మీ మెదడుకు సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
ప్రతిరోజూ 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయాలంటున్నారు నిపుణులు. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి వారం కనీసం 5 రోజులు పరుగెత్తడం వంటి ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని 43శాతం వరకు తగ్గించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..