Nail Biting Side Effects: టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.? అయితే, ఇది మీ కోసమే..!

ఇంట్లో గోర్లు కొరికే అలవాటు ఉన్నవారిని పెద్దలు వారిస్తుంటారు. అదేం చెడు అలవాటు అని మందలిస్తుంటారు. అయితే మన పెద్దలు, గురువులు చెప్పినట్టుగా గోర్లు కొరకటం నిజంగానే చెడ్డు అలవాటు అంటున్నారు నిపుణులు. నిజానికి గోళ్లు కొరికే అలవాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచంలో దాదాపు 30 శాతం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఈ అలవాటు వల్ల కలిగే హాని, […]

Nail Biting Side Effects: టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.? అయితే, ఇది మీ కోసమే..!
Nail Biting Side Effects
Follow us

|

Updated on: Apr 16, 2024 | 11:50 AM

ఇంట్లో గోర్లు కొరికే అలవాటు ఉన్నవారిని పెద్దలు వారిస్తుంటారు. అదేం చెడు అలవాటు అని మందలిస్తుంటారు. అయితే మన పెద్దలు, గురువులు చెప్పినట్టుగా గోర్లు కొరకటం నిజంగానే చెడ్డు అలవాటు అంటున్నారు నిపుణులు. నిజానికి గోళ్లు కొరికే అలవాటు మిమ్మల్ని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచంలో దాదాపు 30 శాతం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఈ అలవాటు వల్ల కలిగే హాని, దానిని ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం…

గోళ్లు కొరకడం వల్ల గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలోకి చేరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శరీరాన్ని తన ఆవాసంగా మార్చుకుంటుంది. దీని వల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. మరొక ప్రతికూలత ఏమిటంటే, ఈ ఇన్ఫెక్షన్‌లో గోళ్లు చీముతో నిండిపోతాయి. ఇన్‌ఫెక్షన్ కారణంగా అవి ఉబ్బుతాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే జ్వరం, బాడీ పెయిన్స్‌ వంటి సమస్యలు వస్తాయి. డయాబెటిక్ రోగులకు గోర్లు కొరికే అలవాటు మరింత ప్రమాదంకరం అంటున్నారు నిపుణులు. అలాగే, మీరు మీ గోళ్లను పదేపదే కొరికే అలవాటు చేసుకుంటే, ఇది మీ గోర్ల సహజ పెరుగుదలను అడ్డుకుంటుంది. పదే పదే గోళ్లు కొరికేయడం వల్ల వాటి పెరుగుదల కణజాలం దెబ్బతింటుంది. ఈ కారణంగా, గోర్లు పెరగడం ఆగిపోవచ్చు.

గోళ్లను నమలడం వల్ల అందులో పేరుకుపోయిన ఫంగస్ నోటి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. గోళ్లు నమలడం లేదా కొరకడం వల్ల దంతాలు బలహీనపడతాయి. ఇది చిగుళ్లలో రక్తస్రావం లేదా దంతాల నొప్పికి కూడా కారణం కావచ్చు. కాబట్టి గోళ్లను పొరపాటున కూడా పంటితో కొరికేయడం చేయరాదు. ఇలా చేస్తే ప్రేగులకు హాని కలిగిస్తుంది. గోళ్లను నమలడం వల్ల మురికి శరీరంలోకి ప్రవేశించి జీర్ణవ్యవస్థకు, జీవక్రియలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీని వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

గోరు కొరికే అలవాటు మానుకోవడానికి చిట్కాలు..

1. మీరు గోరు కొరకడం అనే చెడు అలవాటును వదులుకోవాలనుకుంటే, మీరు మౌత్ గార్డ్ సహాయం తీసుకోవచ్చు.

2. చాలా మంది ఒత్తిడికి లోనైనప్పుడు గోళ్లు నములుతూ ఉంటారు. కాబట్టి, ఒత్తిడిని తొలగించడానికి ప్రయత్నించండి.

3. కావాలంటే వేప రసాన్ని గోళ్లపై రాసుకోవచ్చు. ఇది మీరు మీ నోటిలో గోర్లు పెట్టినప్పుడు చేదును కలిగిస్తుంది. దాంతో గోర్లు నోటిలో పెట్టుకోకుండా, కొరికేసే అలవాటును మానేయాలని మీకు గుర్తు చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles